ఓ మై గాడ్: కీర్తి సురేష్ కూడా లవ్ ఫెయిల్యూరా..? బ్రేకప్ విషయాని ఓపెన్ గా చెప్పేసిన మహానటి..!!

ఓ మై గాడ్ నిజంగానే ఇది కీర్తి సురేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి . కీర్తి సురేష్ కూడా లవ్ ఫెయిల్యూరా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే తాజాగా ఆమె నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని హీరోగా నటిస్తూ ఉండగా హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుంది . ఫస్ట్ టైం ఈ సినిమాలో డి గ్లామరస్ లుక్ లో కనిపించబోతుంది కీర్తి సురేష్ . కాగా ఈ సినిమాలో వెన్నెల అనే పాత్ర ద్వారా జనాలకు సరికొత్త టచ్ ను ఇవ్వబోతుంది కీర్తి సురేష్ అంటూ డైరెక్టర్ ఇదివరకే చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు తెరపై కీర్తి సురేష్ ని మనం చూసింది ఒక యాంగిల్ అని ఈ సినిమాలో మరో యాంగిల్ లో కనిపించబోతుంది అంటూ డైరెక్టర్ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . అంతేకాదు రీసెంట్గా కీర్తి సురేష్ దసరా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన లవ్ బ్రేకప్ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసింది. దసరా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది కీర్తి సురేష్ . ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె లవ్ బ్రేకప్ గురించి ప్రశ్న ఎదురైంది.

బ్రేకప్ చేదుగా ఉంటుందా..? మందు చేదుగా ఉంటుందా..? అనే ప్రశ్నకు కీర్తి సురేష్ స్పందిస్తూ ఆమె బ్రేకప్ ఏ చేదుగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే హోస్ట్ మీకు బ్రేకప్ జరిగిందా..? అన్న కోణంలో ప్రశ్నించగా నవ్వుతూ సమాధానం ఇస్తూ ఉండగా.. మధ్యలో హీరో నాని “మహానటి” అంటూ పంచ్ వేయడం అందరికి షాకింగ్ గా అనిపించింది . నాని చెప్పిన డైలాగ్ బట్టి చూస్తుంటే కచ్చితంగా కీర్తి సురేష్ కి బ్రేకప్ అయ్యిందని అంటున్నారు జనాలు .

అంతేకాదు కీర్తి సురేష్ కూడా లవ్ బ్రేకప్ చేదుగా ఉంటుంది అని అంత కాన్ఫిడెంట్ గా చెప్పిందంటే కచ్చితంగా ఆమె ఎవరినో ప్రేమించి ఆ బాధను భరించే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ప్రస్తుతం కీర్తి సురేష్ చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. అంతేకాదు కీర్తి సురేష్ అంత స్పాంటేనియస్ గా బ్రేకప్ పై స్పందించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది . కీర్తి సురేష్ నిజంగానే ప్రేమించిందా..? లవ్ ఫెయిల్యూర్ అయిందా..? ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అయితే ఎవరితో ఏ హీరోతో అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది..?