ఇంట్రెస్టింగ్ బజ్‌: ఎన్టీఆర్‌తో తలప‌డేది ఎవరు.. కొరటాల స్కెచ్ ఎలా ఉంది..!

త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ తన తాజా సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి విలన్‌గా పలువురు బాలీవుడ్ నటుల పేర్లు కూడా వినిపించాయి. అందులో సంజయ్ దత్‌ను ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నారని మొదట ఓ వార్త వినిపించింది.

NTR 30: Janhvi Kapoor's new Tollywood movie will launch soon; all details  about the movie - TechnoSports

ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ కి విలన్ గా నటించబోతున్నారు అంటూ ఓ టాక్ నడిచింది. అంతేకాకుండా ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా అసలు ఈ సినిమాకి విలన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. మరి ఎన్టీఆర్ సినిమాకి విల‌న్‌ ఎవరు? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు.

NTR's final deadline for Koratala Siva

మొత్తానికి కొరటాల శివ ఈ సినిమాకి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం ఎంతో ఆసక్తిగా మారింది.పైగా జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో ఒకేసారి రిలీజ్ చేసినందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక మరి ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో తలపడే విలన్ ఎవరనేది తెలియాల్సి ఉంది.