నా పని అయిపోయిందన్న వారికి ఇదే నా సమాధానం.. బ్రహ్మానందం..!!

ప్రేక్షకులను నవ్వించడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు.. కానీ కమెడియన్లు పలు రకాల డైలాగులతో స్క్రిప్టులతో పంచులతో చేసేటువంటి చేష్టలతో ప్రేక్షకులను అభిమానులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. అయితే ఎలాంటి విషయాలలోనైనా నవ్వించడంలో బ్రహ్మానందం దిట్ట అని చెప్పవచ్చు. అందుకే ఆయనను హాస్యబ్రహ్మ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటివరకు కేవలం కామెడీ తరహా పాత్రలలోనే చేసిన బ్రహ్మానంద రంగమార్తాండ సినిమాలో వైవిద్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర చాలా కొత్తగా ఉందంటూ ఆడియన్స్ తెలియజేస్తున్నారు.

Legendary Actor Dr. Brahmanandam Press Meet about Rangamarthanda Movie |  Krishna Vamsi - YouTube
తాజాగా బ్రహ్మానందం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.నా జీవితంలో జరుగుతున్నది ఏది ముందుగా ఊహించలేదని నేను రెండు పూటలా తినడానికి కూడా ఆలోచించుకున్న రోజులు చాలానే ఉన్నాయి అటువంటిది..MA చదివాను ఆ తరువాత లెక్చరర్ ఉద్యోగం కూడా సంపాదించాను ఊహించకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇలా అవుతుందని నేనెప్పుడూ అసలు ఊహించలేదు అంటూ తెలిపారు బ్రహ్మానందం.. గతంలో డబ్బు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఇప్పుడు మంచి స్థానంలోకి వచ్చాక పేరు కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నానంటూ తెలిపారు బ్రహ్మానందం..

Rangamarthanda: Is this just the game-changer that Brahmanandam needs in  his second innings? Here's his first look
ఎవరైనా సరే ఎదుటివారు బాగుండాలని కోరుకుంటారు. కానీ తమకన్నా బాగుండాలని మాత్రం కోరుకోరు నేను స్టార్ హీరోలు అందరితో పని చేస్తూ ఎదుగుతున్నప్పుడు చాలామంది అసూయపడ్డారు సుధాకర్ వచ్చారు బ్రహ్మానందం పనైపోయింది బాబు మోహన్, ఎల్బీ శ్రీరామ్ వచ్చారు. ఇక బ్రహ్మానందం పని అయిపోయినట్టే.. పృద్వి వచ్చారు బ్రహ్మానందం వెనుకబడిపోయారు ఇలా కొత్తగా ఏ కమెడియన్ వచ్చినా సరే తన పని అయిపోయింది అంటూ కామెంట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను.. కానీ చివరికి రంగమార్తాండ సినిమాల తన పాత్ర మీరు తప్ప ఇంకెవరు చేయలేరని కృష్ణవంశీ గారు అడిగారు నాకది చాలు అని తెలియజేశారు బ్రహ్మానందం.