తొలిసారిగా రజనీకాంత్, చిరంజీవి మధ్య భారీ వార్.. గెలిచేది ఎవరు!

ప్రస్తుతం రజనీకాంత్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ విజయం సాధించలేకపోతున్నారు. దాంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో “జైలర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు . నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ కి జంటగా తమన్నా నటిస్తుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే జైలర్ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్నాయి. జైలర్ సినిమా ఆగస్టు 11న విడుదల కానున్నట్లు సమాచారం. భారీ అంచనాలతో విడుదల కానున్న జైలర్ సినిమా ప్రేక్షకులను అలరించి, ఈ సారైనా ఈ స్టైలిష్ సూపర్ స్టార్‌కి విజయాన్ని అందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

ఇక తమిళ సినిమా వేదాళంకు రీమేక్‌గా రానున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో 154 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా తమన్నా నటిస్తుండగా, చిరంజీవికి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. భోళా శంకర్ సినిమా ఆగస్టులో ప్రేక్షకులకు ముందుకు రానుంది.

రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా, చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈ ఏడాది ఆగష్టు నెలలో ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సందర్బంగా చిరుకి, రజినికి మధ్య గట్టి పోటీనే ఉండభోతుందని అర్థం అవుతుంది. మరి ఇద్దరు స్టార్ హీరోలే కాబట్టి రిలీజ్ డేట్స్‌ని మార్చుకుంటారా లేకపోతే ఒకరోజు రిలీజ్ అయ్యి పోటీ పడతారా అనేది వేచి చూడాలి. ఏదయితేనే ఈ ఏడాది స్టార్ హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకులను గట్టిగానే అలరించనున్నారని అర్థం అవుతుంది.