ఇండియన్ సినీ హిస్టరీలో ఏ హీరోకు లేని దిమ్మ‌తిరిగే రికార్డ్ మ‌న తార‌క్‌దే..!

చిత్ర పరిశ్రమంలో కొంతమంది స్టార్ హీరోలు నటనే ప్రాణంగా జీవిస్తారు. అలా నటనే ప్రాణంగా భావించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటాడు. ఎన్టీఆర్ ప్రతిభకు ఆయనకు దక్కిన గుర్తింపుకు ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన అభిమానులు భావిస్తారు. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు.

వెరైటీ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్ జాబితాలో టాప్-10లో జూనియర్ ఎన్టీఆర్ నిలవగా ఈ జాబితాలో నిలిచిన హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఈ అరుదైన రికార్డ్ తారక్ కు మాత్రమే సొంతమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌కు ఆస్కార్ వస్తే మాత్రం ఆయన అభిమానులు సంతోషం మామూలుగా ఉండదు.

ఇక ప్రస్తుతం తారక్ కొరటాల శివతో చేయబోయే సినిమాకు సంబంధించిన పనుల‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను కూడా వచ్చేనెల ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇక 2024లో ఏప్రిల్ 5న ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నామని న్యూ ఇయర్ కానుకగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అప్డేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో ప్రభంజనం సృష్టించనున్నారని ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Telugu Ntr, Ntr Fans, Ntr Rare, Ntr Oscar Award, Rare, Rrr, Tarak, Tollywood-Lat

ఎన్టీఆర్ ప్రతిభకు ఎన్ని అవార్డులో వచ్చిన తక్కువేనని ఆయనకు మరిన్ని అవార్డులు రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా పూర్తి అయ‌న వెంటనే కేజిఎఫ్ సినిమాలతో పాన్‌ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్‌తో తన 31వ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఇండియన్ బాక్సాఫీస్ మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంది.