కొంప ముంచేసిన త్రిష .. నీకు అది అవసరమా..?..ఫ్యాన్స్ కి ఎక్కడో మండిన్నట్లుందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ పొజిషన్లో ఉన్నాక మనం మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడాలి . మైక్ ముందు ఉంది కదా అని నోటికి ఏం మాట వస్తే ఆ మాట మాట్లాడితే జనాలు చూస్తూ ఊరుకోరు. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా సరే సోషల్ మీడియాలో ఏకిపారేస్తారు. ప్రజెంట్ అదే విషయంలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష .

అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే .. తనదైన స్టైల్ లో అందంతో ఆకట్టుకున్న త్రిష సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే .. ఆల్మోస్ట్ అందరి హీరోస్తో నటించి స్క్రీన్ షేర్ చేసుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది . కేవలం తమిళ్లోనే కాదు తెలుగులోనూ తన అందాలను రుచి చూపిస్తూ ఎంతోమంది స్టార్ హీరోస్ ని తన అందాలకి మంత్రముగ్ధులను చేసుకుంది . రీసెంట్గా పోనియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లోను దూసుకుపోతుంది త్రిష.

రీసెంట్ గా నటించిన తమిళ చిత్రం రాంగి థియేటర్లో గ్రాంద్ గా రిలీజ్ అయింది . ఈ చిత్ర ప్రమోషన్స్ లో మొన్నటి వరకు బిజీగా ఉన్న త్రిష .. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టంగ్ స్లిప్ అయింది . యాంకర్ అడుగుతూ..” మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం “అంటూ ప్రశ్నించారు . అడిగిన వాటికిసూటిగా ఆన్సర్ ఇస్తూనే మధ్యలో ఓ కులం పేరును ప్రస్తావించింది. నాకు సౌత్ ఇండియన్ హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.. అయితే అందులోను బ్రాహ్మణుల ఇంటి భోజనాన్ని చాలా చాలా ఇష్టపడతాను అంటూ గట్టిగా నొక్కి చెప్పింది . దీనితో సోషల్ మీడియాలో త్రిష ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. ఫుడ్ అడిగినప్పుడు ఫుడ్ గురించి ఆన్సర్ ఇవ్వాలి . మధ్యలో క్యాస్ట్ ఎందుకు వచ్చింది అంటూ జనాలు ట్రో చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో త్రిష పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది..!!