ఫైనల్లీ అన్ని వదిలేసి..సాయిపల్లవి ని ఫాలో అవుతున్న సమంత..చేతిలో రుద్రాక్ష మాల అందుకేనా ..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత.. రీసెంట్ గా నటించిన సినిమా శాకుంతలం ..ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న గుణశేఖర్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వర్క్ చేశారు .
కాగా మలయాళీ స్టార్ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు . ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ట్రైలర్ ఈవెంట్ ప్రోగ్రాంలో సమంత చాలా క్లాస్ లుక్ లో అదరగొట్టేసింది .

మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది . అయినా కానీ తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గని సమంత శాకుంతలం.. సినిమా కోసం ఆరోగ్యం బాగో లేకపోయినా సరే ప్రమోషన్స్ కి ముందుకొచ్చింది . ఈ క్రమంలోనే సమంత పై మీడియా ఫోకస్ ఎక్కువగా పెట్టింది . ఈ క్రమంలోనే సమంత కట్టుకున్న తెల్లచీరలో స్పెషల్ అందాలను మరి కాస్త బ్రైట్నెస్ పెంచాయి. కాగా లుక్స్ పరంగా ఎలా ఉన్నా సరే సమంత మాత్రం చేతిలో ఎప్పుడూ లేనివిధంగా రుద్రాక్ష మాలను పట్టుకొని ఉండడం అందరి కంటికి ఆశ్చర్యకరంగా అనిపించింది.

అంతేకాదు ఆ శారీ లుక్ లో సమంత రుద్రాక్ష మాల చేతిలో పెట్టుకొని ఉండడం చూసి మరో సాయి పల్లవి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . మనకు తెలిసిందే మలయాళ బ్యూటీ సాయి పల్లవి ఎక్కడికొచ్చినా సరే చేతిలో రుద్రాక్ష మాలను పట్టుకుని ఉంటుంది . ఆమెకు అది చాలా లక్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సమంత కూడా అలా చేతిలో రుద్రాక్ష మాలను పట్టుకొని సింపుల్ అండ్ డీసెంట్ లుక్ లో దర్శనం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి చేతులో రుద్రాక్ష మాలపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో..?