గూఢచారి2 కోసం అడవిశేష్‌ అలాంటి పనులు చేస్తున్నాడా..? కేక పెట్టించేస్తున్నాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న అడవి శేష్.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే . పాన్ ఇండియా హీరో గా మారిన అడవి శేష్ రీసెంట్గా నటిస్తున్న సినిమా గూడచారి 2 . ఈ సినిమాలోను స్పైగా అలరించబోతున్నాడు అడవి శేష్. మనకు తెలిసిందే ఆయన వరుసగా క్షణం , ఎవరు, గూడచారి స్పై, హిట్ 2 చిత్రాలలో నటించి అలరించాడు . ఇప్పుడు మరోసారి స్పైగా తనదైన స్టైల్ లో రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అడవి శేష్.

ఆయన నటించిన ఫిలిం గూడచారి స్పై ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కూల్ అండ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా మారింది . కాగా అదే ఆశతో గూఢచారి 2 లోను నటిస్తున్నాడు . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు . ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఫస్ట్ లుక్ ని అలాగే ప్రీ విజన్ అనే పేరుతో వీడియోని రిలీజ్ చేశారు .

హాట్ నెస్ ఓవర్ లోడింగ్ అన్నట్లుగా బిల్డింగ్ నుంచి పడిపోతూ కనిపించాడు . ఇదంతా చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది అంటున్నారు అభిమానులు . అంతేకాదు అడవి శేష్ సినిమా కోసం సపరేట్ డైట్ ఫాలో అవుతున్నాడట. మరీ ముఖ్యంగా బాడీ ఫిట్నెస్ కోసం యాక్షన్ సీన్స్ చేయడానికి స్ట్రెంత్ కోసం సపరేట్ డైటీషియన్ పెట్టుకొని మరీ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట.

కాగా ఈ సినిమాల్లో అడవి శేష్ ఇంటర్నెషనల్ స్పై గా కనిపించబోతున్నాడని చిత్ర బృందం తెలిపింది . వరుస విజయాలతో జోరు మీదున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్ పథకాలపై టీజీ విశ్వప్రసాద్ అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాల నిర్మిస్తున్నారు . కాగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది చిత్ర బృందం . ఖచ్చితంగా ఈ సినిమాతో అడవి శేష్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అంటున్నారు ఫ్యాన్స్..!!