పిల్లలని చెడకొట్టకండి..సిరి-శ్రీహాన్‌ కి ఇచ్చిపడేసిన సింగర్ చిన్మయి.. సంచలన పోస్ట్‌..!!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లల్లో స్టార్ సెలబ్రిటీ అయిన సింగర్ చిన్మయి కూడా ఒకరు . ఎప్పటికప్పుడు ఏ ఇష్యూ జరిగిన తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇప్పటికే మీటు వివాదంలో సింగర్ చిన్మయి ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించిన.. మహిళల మనోభావాలను కించపరచాలని చూసిన ..వాళ్లకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది చిన్మయి.

సోషల్ మీడియా సెలబ్రిటీస్ అయినా శ్రీహ పై విరుచుకు పడింది . దానికి కారణం ఆయన తాజాగా పోస్ట్ చేసిన వీడియోనే అంటూ తెలుస్తుంది . సోషల్ మీడియా వేదికగా పలు విషయాలపై ఘాటుగా స్పందించే చిన్మయి రీసెంట్గా శ్రీహన్ పోస్ట్ చేసిన ఇంస్టాగ్రామ్ వీడియోను ట్యాగ్ చేస్తూ తప్పుపట్టారు . ఈ వీడియోలో శ్రీహన్ తన దగ్గర ఉన్న బాబును భయపెట్టడానికి తనను తాను బెల్టుతో కొట్టుకుంటూ ఉంటారు . సాధారణంగా ఇంట్లో ఎవరైనా పిల్లలు మాట వినకపోతే బెదిరించి దెబ్బ వేసి కంట్రోల్ లో పెడతారు .అయితే అది తప్పుడు పద్ధతి .

మన సమాజంలో పెద్ద వాళ్ళు చెప్పిన మాట వినకపోతే సూసైడ్ చేసుకుంటాం , చేతులు కోసుకుంటాం అంటూ బెదిరిస్తూ ఉంటారు . పెళ్లి , చదువు వంటి విషయాలలో ఎక్కువగా ఇలాంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం . అయితే అది తప్పు ఆ విషయాన్ని చిన్నతనం నుండే మనం పిల్లలకి నేర్పించాలి. పిల్లల ముందు ఇలా ప్రవర్తించకూడదు అంటూ తనదైన స్టైల్ లో శ్రీహానికి ఇచ్చి పడేసింది చిన్మయి.

అయితే సిరి సైతం ఈ విషయంపై రెస్పాండ్ అయింది . ఇది మొత్తం తన బాబు ఆడిషన్ లో భాగంగా నేర్చుకుంటున్న వీడియో అని ..దీనిపై ఇంత రాద్ధాంతం అవసరం లేదని ..రాత్రికి రాత్రి ఈ వీడియో ఇంత వైరల్ అయిపోతుందని అస్సలు అనుకోలేదని ..క్లారిటీ ఇచ్చింది . కాగా మనకు తెలిసిందే సిరి మేనమామ కొడుకు ఆమె వద్దనే ఉంటాడు. ఆమెను అమ్మ అని శ్రీహాన్ ని నానా అని పిలుస్తూ ఉంటాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో కూడా ఈ బాబు తనదైన స్టైల్ లో హౌస్ లో ఎంట్రీ ఇచ్చి అల్లరి అల్లరి చేసేసాడు . త్వరలోనే సిరి-శ్రీహన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)