సావిత్రి గురించి సంచలన విషయాలు బయటపెట్టిన అలనాటి నటి జమున..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి అందాల తార జమున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జమున తనను కొంతమంది మోసం చేశారని బోరున ఏడ్చేశారు. అసలు విషయం ఏంటంటే అలనాటి మహానటి సావిత్రి బయోపిక్‌ని 2018లో అద్భుతంగా చిత్రికరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సావిత్రి అడుగు పెట్టినప్పటి నుంచి ఆమె మరణం వరకు సావిత్రి జీవితం ఎలా గడిచిందనే దాని గురించి చాలా స్పష్టంగా ‘మహానటి’ సినిమాలో చూపించారు దర్శకుడు. అలాంటి అద్భుతమైన మహానటి సినిమాపై నటి జమున సంచలన వ్యాఖ్యలు చేసారు.

మహానటి సినిమా తీసే సమయంలో సావిత్రికి సంబంధించిన వారిద్దరిని కలిశారట ఆ చిత్ర బృందం. కానీ సావిత్రికి ఎంతో సన్నిహితురాలైన జమునను మాత్రం ఎవరూ కలవలేదట. నిజానికి సావిత్రి జీవితం గురించి సినిమా తీస్తున్న విషయం కూడా జమునకి తెలియదట. అసలు మహానటి సినిమాలో జమున పాత్ర లేకుండా ఆ సినిమాని ఎలా తీశారని ఆమె బాధపడ్డారు. సావిత్రిని జమున ఎప్పుడు అక్క అని పిలుస్తూ ఉండేవారట. సావిత్రి, జమున ఎక్కువగా కలిసి తిరిగేవారట, ఒకరి విషయాలను ఇంకొకరితో పంచుకునేవారట. నిజానికి జమునని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా సావిత్రినే అని జమున గారు వివరించారు.

ఆ తరం హీరోయిన్స్‌లో సావిత్రి గురించి బాగా తెలిసి, ఇప్పటికి బ్రతికి ఉన్న జమునను కలవకుండా సావిత్రి బయోపిక్ తీయడం అనేది ఆమెకి చాలా బాధను కలిగించిదట. ఒక ఇంటర్వ్యూలో సావిత్రి మహానటి సినిమా గురించి చెప్పమని అడిగితే జమున ఈ విధంగా కామెంట్స్ చేసారట. సినీ ఇండస్ట్రీలో సావిత్రి ఎన్ని ఇబ్బందులు పడిందో అనేదాని గురించి తనకంటే ఎక్కువ ఎవరికీ తెలియదని జమున తెలిపారు. వారిద్దరి మధ్య సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాల గురించి కూడా ఒకరితో ఒకరు షేర్ చేసుకునేవారట. ఇంత మంచిగా ఉన్న మేం, సావిత్రి చనిపోయినప్పుడు కోలుకోవడానికి నాకు చాలా సమయం పట్టిందని జమున అన్నారు. అయితే మహానటి సినిమా చూసిన వాళ్లంతా చాలా బాగుంది అన్నారు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది కానీ ఆ చిత్ర బృందం ఆమెని కలవకపోవడం చాలా బాధగా అనిపించిందని జమున కంట తడి పెట్టారు.