హీరో నాని-అంజన పెళ్లి బంధానికి పదేళ్లు.. వీరి ప్రేమ కథ గురించి మీకు తెలుసా?

న్యాచురల్ స్టార్ నానీ .. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరు. దాదాపు 14 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. గతంలో నాని కెరీర్ ప్రారంభంలో ఆర్జేగా పనిచేసి ఆ తర్వాత క్లాప్ బాయ్ గా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసి ఎంతో కష్టపడ్డాడు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని అంటారు.

 

 

అయితే నానికి ఆ అదృష్టం ఇంద్రగంటి రూపంలో లభించింది. నానిని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ `అష్టా చమ్మా` సినిమాను తెర్కకెక్కించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక అప్పటినుండి వరుస సినిమాలు తీస్తూ నేచురల్ స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

అయితే నాని 2012లో అంజన ఎలవర్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మొదట్లో వీరి పెళ్లికి అంజన తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. దానికి కారణం నాని ఇంకా అప్పటికి కెరీర్ పరంగా స్థిరపడలేదని వారు అంగీకరించలేదట. ఇక అంతే కాకుండా అంజు పేరెంట్స్ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని నాని నాలుగేళ్లు వెయిట్ చేశాడట.

ఇక మొత్తానికి నాని హీరోగా నిలదొక్కుకోవడంతో తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం వీరిద్దరికీ అర్జున్ అనే కొడుకు ఉన్నాడు. అయితే ఇటీవల ఈ జంట పెళ్ళి చేసుకుని 10 సంవత్సరాలు పూర్తి కావడంతో.. ఈ సందర్భంగా నాని ఓ బ్యూటిఫుల్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది.

ఇక నాని పర్సనల్ లైఫ్ మరియు సినీ కెరీర్ పరంగా కూడా మంచి సక్సెస్ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ దంపతులకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి.