వెకేషన్ మూడ్ లో మహేష్.. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుని అందరూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మాన్ అని అంటూ ఉంటారు. దానికి గల కారణం.. మహేష్ సినిమాలు, యాడ్ షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నా సరే.. కనీసం ఏడాదికి రెండు, మూడు సార్లు భార్యా పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.

షూటింగ్స్ నుండి గ్యాప్ దొరికిన సరే.. లేదంటే పిల్లలకు హాలిడేస్ ఉన్న ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటారు. ప్రస్తుతం మహేష్ వెకేషన్ మూడులో ఫ్యామిలీతో ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసా? అయితే ప్రెజెంట్ మహేష్ ఫ్యామిలీతో లండన్ లో హిస్టారికల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ని విజిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా `లండన్ ఈజ్ ఆల్వేస్ గుడ్` అని కామెంట్ చేస్తూ హైడ్ పార్క్, లండన్ డైరీస్ హ్యష్ ట్యాగ్లతో నమ్రత ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.