46 ఏళ్లు వచ్చినా తగ్గని అందం.. ఆమె ఒంపుసొంపులకు పిచ్చోళ్లవుతున్న కుర్రాళ్లు!

మర్డర్ సినిమాతో సూపర్ పాపులర్ అయిన సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌స్క్రీన్ లిప్‌లాక్‌లతో సెగలు పుట్టించే ఈ భామ బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత కొన్ని హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇటీవల మల్లిక తన 46వ వసంతంలోకి అడుగు పెట్టింది. అయితే 46 ఏళ్ల వయసులో ఉన్నా కూడా ఆమె ఫిగర్స్ 30 ఏళ్ల హీరోయిన్‌లా ఉన్నాయి. ఈ హాట్ యాక్ట్రెస్ ఈ రోజు బీచ్ నుంచి ఓ ఫొటో షేర్ చేసింది. ఆ ఫొటోలో ఆమె స్విమ్‌సూట్ లేదా బికినీ వంటి వాటి కంటే మరీ షార్ట్ డ్రెస్‌లో కనిపించింది.

ఆమె తన అందాలతో ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆమె ఒంపుసొంపులకు పిచ్చోళ్లవుతున్నారు కుర్రాళ్లు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఫ్రాన్స్ మరియు భారతదేశం మధ్య తిరుగుతూ ఉంది. ఈ సెక్సీ స్టార్ ఇటీవలి కాలంలో డర్టీ పాలిటిక్స్, ఆర్కే వంటి రెండు ప్రాజెక్ట్‌లను చేసింది. మల్లికా షెరావత్ చాలా సినిమాల్లో బోల్డ్ లుక్స్‌లో కనిపించే కాంట్రవర్సీలకు కూడా దారితీసింది. ఆమె తన కెరీర్‌ను టీవీ కమర్షియల్స్, మ్యూజిక్ వీడియోల ద్వారా ప్రారంభించింది.

బాలీవుడ్‌లో ఆమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె మర్డర్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, షాదీ సే పెహ్లే, వెల్‌కమ్ వంటి అనేక చిత్రాలలో పని చేసింది. ఇవి మాత్రమే కాదు, ఆమె హిస్స్, పాలిటిక్స్ ఆఫ్ లవ్ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్‌లను గెలుచుకుంది. ఆమె మ్యారేజ్ స్టేటస్ ఇప్పటికీ రహస్యంగా ఉంది. కాగా కరణ్ సింగ్ గిల్‌తో ఆమె వివాహం కేవలం 2000-2001 వరకు ఒక సంవత్సరం మాత్రమే కొనసాగింది.