జ‌న‌సేన‌పై మెగా ఎఫెక్ట్‌… వీళ్లు గేమ్ చేంజ్ చేసుకోక త‌ప్ప‌దా…!

రాజ‌కీయాల‌పై ఎవ‌రు ఎప్పుడు ఎలాంటి ప్ర‌భావం చూపిస్తారో చెప్ప‌డం క‌ష్టం. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో నూ ఇలాంటి ప‌రిణామాలే చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వె నుక‌.. ఆయ‌న త‌ప్ప‌.. ఇంకెవ‌రూ లేర‌ని.. నాగ‌బాబు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న ఎఫెక్ట్ అంతంత మాత్ర‌మేన‌నే చ‌ర్చ సాగింది. గ‌త ఎన్నిక‌ల్లో ద‌క్కిన ఓటు బ్యాంకు.. ఇత‌ర‌త్రా రీజ‌న్లు.. వంటివి ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి.

Here are the Jana Sena chief Pawan Kalyan's Rayalaseema tour details

అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఒక‌వైపు.. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో జ‌న‌సేన‌కు అవ‌స‌ర‌మైతే.. అండ‌గా ఉంటానంటూ.. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌క‌టించారు. దీంతో అనూహ్యమైన ప‌రిణామాలు చోటుచేసుకునే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా తెలుగు చ‌ల‌న చిత్ర‌రంగంలో కీల‌క‌మైన న‌టులు.. వ‌ర్గాలు.. కాపు సామాజిక వ‌ర్గం ఇలా.. ఒక‌టేమిటి.. అన్ని వ‌ర్గాలు.. కూడా చిరు కోస‌మైనా.. జ‌న‌సేన వెంట న‌డిచేందుకు వ‌స్తాయ‌నే అంచ‌నాలు వున్నాయి.

ఇక‌, సాధార‌ణ పొలిటిక‌ల్ సిట్యుయేష‌న్ చూసుకున్నా.. రాష్ట్ర ప్ర‌జలు అటు చంద్ర‌బాబు పాల‌న‌ను చూశా రు. ఇటు జ‌గ‌న్ ప‌రిపాల‌న‌ను చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ మార్పు కోరుకునే అవ‌కా శం.. ఉంటే.. అది ఖ‌చ్చితంగా ప‌వ‌న్ వైపు ఎందుకు మొగ్గ‌కూడ‌ద‌నే చ‌ర్చ కూడా చాప‌కింద నీరులా.. విస్త‌రి స్తోంది. కొంద‌రు మేధావి వ‌ర్గాలు.. ఈ చ‌ర్చ‌ను వ్యాప్తి చేస్తున్నాయి. అంతేకాదు.. ఒక్క ఛాన్స్ జ‌గ‌న్‌కు ఇచ్చి న‌ట్టే.. ప‌వ‌న్‌కు ఎందుకు ఇవ్వ‌కూడ‌ద‌న్న ప్ర‌శ్న కూడా వ‌స్తోంది.

Pawan Kalyan : చిత‌క్కొట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన  చిరంజీవి | The Telugu News

వెర‌సి మొత్తంగా.. అన్న‌య్య ఎఫెక్ట్‌.. జ‌న‌సేన‌పై బాగానే భారీగానే ఉండేలా ఉంటుంద‌ని అంటున్నారు. అయితే.. మ‌రికొంద‌రు రాజ‌కీయ పండితులు మాత్రం.. గ‌తాన్ని గుర్తు చేస్తున్నారు. గ‌తంలో ఏం జ‌రిగిందో .. ఇప్ప‌డు కూడా అదే జ‌రుగుతుంద‌ని.. అంటున్నారు. కానీ, నాటి ప‌రిస్థితికి, ఇప్ప‌టి ప‌రిస్థితికి తేడా ఉంద‌ని.. అప్ప‌టి రాజ‌కీయాలు ఇప్పుడు రాజ‌కీయాలు మార్పు ఉంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో అన్న‌య్య ఎఫెక్ట్ జ‌న‌సేన పైనా.. అదేవిధంగా రాజ‌కీయ‌, సినీ రంగంపైనా బాగానే ఉంటుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.