పోలవరం టఫ్..చింతలపూడి వన్‌సైడ్..!

రాష్ట్రంలో ఎస్టీ స్థానాలు ఎక్కువగా ఉండేది..అరకు పార్లమెంట్ పరిధిలోనే. అక్కడే మెజారిటీ ఎస్టీ స్థానాలు ఉన్నాయి. అయితే ఏలూరు పార్లమెంట్ స్థానంలో ఉన్న ఏకైక ఎస్టీ స్థానం పోలవరం. అలాగే ఇదే పార్లమెంట్‌లో చింతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వడ్ స్థానంగా ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మొదటి నుంచి టీడీపీకి పెద్ద పట్టు లేదనే సంగతి తెలిసిందే..గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా కొనసాగుతుంది.

ఇక గత ఎన్నికల్లో పోలవరం, చింతలపూడి స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటేసింది..మరి ఈ మూడేళ్ళల్లో ఎస్టీ స్థానంగా ఉన్న పోలవరం, ఎస్సీ స్థానంగా ఉన్న చింతలపూడిలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నాయంటే. రెండుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద పాజిటివ్ లేదనే తెలుస్తోంది..అలా అని రెండుచోట్ల టీడీపీకి కూడా పెద్ద పాజిటివ్ లేదు.

అంటే రెండుచోట్ల రెండు పార్టీలకు వింత పరిస్తితులు ఉన్నాయి. వాస్తవానికి చింతలపూడి అనేది టీడీపీ కంచుకోట. 2019 ఎన్నికల తర్వాత ఆ పరిస్తితి మారిపోయింది. పైగా ఇక్కడ వైసీపీలోనూ, ఇటు టీడీపీలోనూ వర్గ పోరు ఎక్కువ ఉంది. వైసీపీలో ఎమ్మెల్యే ఎలిజా, ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గాలకు పెద్దగా పడని పరిస్తితి. అటు టీడీపీలో గ్రూపు తగాదాలు ఎక్కువ ఉన్నాయి..పైగా సరైన నాయకత్వం కనిపించడం లేదు. రెండు పార్టీల్లో వర్గ పోరు ఉన్నా సరే..ఎస్సీ ఓటింగ్ పరంగా వైసీపీకి ప్లస్ ఉంది. అందుకే ఇక్కడ వైసీపీకే ఎడ్జ్ ఉందని తాజా సర్వేల్లో తేలింది.

ఇక పోలవరంలో కూడా అదే పరిస్తితి. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు పెద్ద పాజిటివ్ లేదు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, వరద బాధితులు వైసీపీపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఇక్కడ వైసీపీకి అనుకున్నంత ప్లస్ లేదు. ఇటు టీడీపీలో గ్రూపు గొడవలు ఉన్నాయి. కానీ బలమైన నాయకుడుకు సీటు ఇస్తే..ఈజీగా పోలవరంలో టీడీపీ గెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ వైసీపీ-టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉందని తెలుస్తోంది.