జోరు మీదున్నావు.. అన్నట్టుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు కూడా.. జోరుమీదే ఉన్నారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా.. వారు బలమైన గళం వినిపిస్తున్నారు. నిజానికి గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర నిర్వహించినప్పుడు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నాయకులు ఈ రేంజ్లో స్పందించలేదు. అంతేకాదు.. రైతులకు అనుకూలంగా వ్యవహరించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి వారు కూడా తెరమీదికి వచ్చారు.
మరికొందరు లోపాయికారీగా.. రైతులకు సహకరించారని.. పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. అయితే.. ఈ విషయంలో .. ఏమనుకున్నారో ఏమో.. ఉత్తరాంధ్ర మంత్రులు, నాయకులు.. కూడా.. ముందుగానే తెరమీదికి వచ్చారు. బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరా వులు.. దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మా జిల్లాల్లోకి మీరు ఎలా అడుగు పెడతారోచూస్తామంటూ.. వ్యాఖ్య లు చేస్తున్నారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు సైతం చేస్తున్నారు.
అంతేకాదు.. మరో అడుగు ముందుకు వేసి..ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా.. వికేంద్రీ కరణకు మద్దతుగా.. తాము.. కూడా పాదయాత్ర చేస్తామంటూ.. మంత్రులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. అయితే.. దీనికి తగిన విధంగా గ్రౌండ్‌లో ప్రిపరేషన్ పెద్దగా కనిపించడం లేదు. దీంతో ధర్మాన ప్రసాదరా వు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము విశాఖ రాజదానికి అనుకూలంగా అసవరమైతే.. రాజీనామాలకు కూడా రెడీ అవుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు కాక పుట్టింది. నిజంగానే మంత్రులు రాజీనామా చేస్తారా? చేస్తే.. ఏం జరుగుతుందనే వాదన తెరమీదికి వచ్చింది. మూడురాజధానులకు అనుకూలంగా ఇప్పటి వరకు ఎవరూ కూడా ఇలాంటి ప్రకటన చేయలేదు. పైగా.. మంత్రి పదవులు దక్కితే చాలని అనుకున్న నాయకులు ఉన్నారే తప్ప.. ఎవరూ.. ఇలా తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించలేదు. ఈ క్రమంలో నిజంగానే వీరు రాజీనామాలు చేస్తారా? లేక.. పైపైకి ఇలా చెబుతున్నారా? అనే చర్చ అయితే.. జరుగుతోంది. మరి నిజంగానే వారు రాజీనామా చేస్తారా లేదా.. అనేది చూడాలి.