బ్రేకప్ కాదు బ్రేకప్స్ అంటున్న అల్లు శిరీష్.. పెద్దింటి అమ్మాయితో కూడా అట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అల్లు కుటుంబం నుంచి వచ్చిన అల్లు శిరీష్ ఎలా అయినా తన అన్నలా హీరోగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ద్వారా అనేక సినిమాలు తో ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కొంతకాలం నుండి సైలెంట్ గా ఉన్నాడు.

ఇటీవల ఆయన నటించిన “ఊర్వశివో రాక్షసివో“ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకి రాకేష్ శశి డైరెక్షన్ వహించగా.. అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానియల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా సినిమా యూనిట్ అధికారకంగా ప్రకటించారు. నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలైపోయాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లు శిరీష్ తన జీవితంలో ఉన్న బ్రేకప్ కాదు కాదు బ్రేకప్స్ గురించి బయట పెట్టాడు.

అలా ఇంటర్వ్యూలో యాంకర్ మీ జీవితంలో బ్రేకప్ గురించి చెప్పాలని ప్రశ్నించగా.. దానికి స్పందిస్తూ అల్లు శిరీష్ తన జీవితంలో చాలా బ్రేకప్స్ ఉన్నాయని.. ముఖ్యంగా రెండు మూడు పెద్ద బ్రేకప్స్ అయ్యాయని చెప్పుకొచ్చారు. అలా వారితో చాలా క్లోజ్ గా మూవ్ అయిన తర్వాత బ్రేకప్ అయిందని అయితే వారిలో ఒక పెద్దింటి అమ్మాయి మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయితో కూడా బ్రేకప్ అయిందని అల్లు శిరీష్ పేర్కొన్నారు.

ఈ పాటికి అంతా సజావుగా జరిగి పెళ్లి చేసుకుని ఉంటే అర్హ, అయాన్ లాగా ఇద్దరు పిల్లలు తిరుగుతూ ఉండేవారని.. ఆ విషయంలో అల్లు శిరీష్ అప్పుడప్పుడు బాధపడే వాడ‌నీ, అనవసరంగా బ్రేకప్ చెప్పి టైం వేస్ట్ చేసుకున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. బ్రేకప్ కాదు బ్రేకప్స్ అంటున్న అల్లు శిరీష్ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమాతో నైనా అల్లు శిరీష్ మంచి సక్సెస్ ను అందుకుంటాడో? లేదో ?వేచి చూడాల్సిందే.