అనూతో డేటింగ్ పై అల్లు శిరీష్ క్లారిటీ ఇదే..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు నటుడు అల్లు శిరీష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇప్పటివరకు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన ఏవి అంతగా సక్సెస్ కాలేకపోయాయి. కానీ పట్టు వదలని విక్రమార్కుడుల ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. ఇక ఇందులో హీరోయిన్ గా అను ఇమ్మానియేల్ నటించినది. దీంతో అల్లు శిరీష్ అను ఇమ్మానుయేల్ మధ్య ఏదో ఉందనే వార్తలు చాలా వైరల్ గా మారాయి వాటిపై అల్లు శిరీష్ స్పందించాడు వాటి గురించి తెలుసుకుందాం.

Allu Sirish​, Anu Emmanuel: అల్లు వారబ్బాయితో డేటింగ్.. ఇద్దరి మధ్య ముదిరిన  లవ్ ట్రాక్! అనుమానాలు పెంచిన వీడియో - rumours spreading on allu sirish- anu  emmanuel dating - Samayam Telugu
మీస్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించిన తుప్పరివాలన్ అనే తమిళ చిత్రం ద్వారా అను ఇమ్మానియేల్ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.కానీ ఆమెకు తమిళం కంటే ఎక్కువగా తెలుగులోనే మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. నాని నటించిన మజ్ను చిత్రంతో ఇమే తెలుగులో తన కెరీర్ ని మొదలుపెట్టింది ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ఇక అను ఇమ్మానుయేల్ తండ్రి కూడా మలయాళంలో ఒక చిత్ర నిర్మాతే నట.

ఇక అనుతో డేటింగ్ వార్తలపై స్పందించిన అల్లు శిరీష్ నటీనటుల జీవితంలో ఇలాంటి వదంతులు సర్వసాధారణం. మా ఇద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదు. మేమిద్దరం కేవలం మంచి స్నేహితులమే కొన్ని నెలల పాటు కలిసి పని చేసేము కాబట్టి మా ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. అంతేకాకుండా మా ఇద్దరి వ్యక్తిత్వాలు కూడా ఒకేలాగే ఉంటాయి. అందుచేత మేమిద్దరం మాట్లాడుకోవడానికి ఎక్కువ సమయం ఏర్పడిందని తెలియజేశారు. వర్క్ విషయంలో చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది అను అని తెలిపారు.