రాజకీయాల్లో నాయకులకు ఒక్క ఛాన్స్ అంటూ.. ఎప్పుడో ఒకప్పుడు లభిస్తూనే ఉంటుంది. గతంలో చంద్రబాబుకు కానీ, జగన్‌కు కానీ.. ఈ ఒక్క ఛాన్స్ లభించిన తర్వాతే.. వారు నాయకులుగా.. ఎదిగారు. అయితే.. అది ఏరూపంలో వస్తుందో.. చెప్పలేం. టీడీపీ తరఫున సీఎం అయిన చంద్రబాబు 1995లలో తనను తాను నిరూపించుకుని.. ఒక్క ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా విజన్ ఉన్న సీఎంగా ఆయన చరిత్ర సృష్టించి.. రికార్డు నెలకొల్పారు. ఇక, ప్రతిపక్ష నాయకుడిగా.. పాదయాత్ర చేయడం ద్వారా.. ప్రజల్లో జగన్ ఒక్క చాన్స్ తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఇలాంటి అవకాశమే.. పవన్‌కు కూడా లభించింది. అసలు జనసేనపుంజుకుంటుందా? అనే తరుణంలో ఆయనకు అనూహ్యంగా ఒక్క ఛాన్స్ వచ్చేసింది. దీనిని వైసీపీ నాయకులు కూడా ఊహించలేదు. దీంతో ఒకింత నాయకులు తర్జన భర్జన పడ్డారు. అదే.. ఆయనను విశాఖలో ఓ హోటల్ లో నిర్బంధించడం. తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో జనవాణి కోసం.. విశాఖకు వచ్చిన పవన్ మూడు రోజుల పర్యటనను ఖరారు చేసుకు న్నారు. అయితే.. అనుకోని పరిణామాలతో ఆయన హోటల్‌కే పరిమితం అయ్యారు. ఇది ప్రజల్లోకి బాగా వెళ్లింది.
పవన్ హోటల్ ఉన్నారని కాకుండా.. ప్రభుత్వం.. పవన్‌ను హోటల్ డిటైన్ చేసిందనే టాక్ సర్వత్రావ్యాపించింది. అభిమానులు సైతం రగిలిపో యారు. దీనిపై ఏదో ఒక విధంగా ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో రైతులు కూడా.. తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిం చారు. ఇటు టీడీపీకి కూడా.. ఇది సదవకాశంగా కలిసి వచ్చింది. అంటే.. అటు పవన్‌ను నిర్బంధించిన ఘటనపై జనసేన, ఇటురైతులకు ఇబ్బందులు సృష్టిస్తున్న వైసీపీ నేతలపై పోరాటాలకు.. టీడీపీ ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యాయి.
ఇలాంటి కీలక సందర్భం మళ్లీ రమ్మన్నా రాదు. దీనిని గ్రహించిన వైసీపీ.. ఎలాగైనా..పవన్‌ను విశాఖ నుంచి బయటకు పంపేయాలని.. లేక పోతే.. ఆయనకు సింపతీ పెరిగిపోతుందని.. భావించింది. దీంతో మంత్రులు రంగంలోకిదిగి..ఆయనకు వ్యతిరేకంగా చుక్కలు చూపించారు. అంతే.. వారి వ్యూహంలో చిక్కుకున్నారో.. లేక ఏం చేయాలనిఅనుకున్నారోతెలియదు కానీ.. వెంటనే విశాఖ నుంచి బయటకు వచ్చేశారు. ఇది.. పవన్‌కు లభించిన ఒక్క ఛాన్స్‌ను మిస్ చేసుకున్నట్టు అయిపోయింది. అలా కాకుండా.. పవన్ అక్కడే ఉండి ఉంటే.. సింపతీ పెరిగి.. ఆయనకు రాజకీయంగా మరింత బూస్ట్ లభించేదని అంటున్నారు పరిశీలకులు.