అల్లు అర్జున్ భార్యను హర్ట్ చేసిన మెగా హీరో… అసలు విషయం ఏమిటంటే..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అన్నిటిలోనూ నెంబర్ వన్ గా కొనసాగుతుంది. ఇక మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఏడుగురు పైన హీరోలు టాలీవుడ్కు పరిచయమయ్యారు. వారిలో కొంతమంది మ‌త్ర‌మే చెప్పుకోదగ్గ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తో తన తాత వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో రెండో స్థానంలో ఉన్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ లోనే ప్రభాస్ తర్వాత భారీ రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోగా అల్లు అర్జున్ ఉన్నాడు.

ఇక మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి వారసులుగా వచ్చిన రామ్ చరణ్, వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్, మినహా మిగతా హీరోలు స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకోలేదు. చిరంజీవి ఆశీస్సులతో సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున్ తన టాలెంట్ తో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన ఫ్యామిలీ విషయానికి వస్తే. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరి జంట ఎంతో అందంగా ఉంటుంది. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా తన భార్యతో కలిసి వెళ్తాడు. అల్లు అర్జ‌న్ త‌న భార్య లేకుండా ఏ ఫంక్ష‌న్ కి వెళ్ల‌డు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. వారి పేర్లు అల్లు అయాన్, అల్లు అర్హ.

ఇక ఏ పండగ వచ్చినా మెగా కుటుంబం మొత్తం కలిసి ఒకే ఇంట్లో జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ఓసారి కలిసిన టైంలో మెగా హీరో అల్లు అర్జున్ భార్యని ఆట పట్టించాడట.. మీరు హీరోయిన్ కంటే బాగుంటారు. మీరు సినిమాల్లోకి వస్తే మీ ఆయన కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటారని అల్లు అర్జున్ భార్యని అ మెగా హీరో ఆట పట్టించాడట. ఇక దీంతో అల్లు అర్జున్ భార్య ఈ విషయాన్ని ఆయనకు చెప్పుకొని బాధకు గురైందట. అల్లు అర్జున్ కూడా ఆ మెగా హీరోని ఏం అనకపోయినా తన కోపాన్ని తన మనసులోనే దాచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.