ష్‌… వైసీపీలో గుస‌గుస‌… వాళ్లంతా రెస్ట్‌లోకి వెళ్లిపోయారు…!

ప్లీన‌రీ ముగిసింది. ఎక్క‌డివారు అక్క‌డ స‌ర్దుకున్నారు. ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేత‌లు చేస్తున్న ప‌ని. ఏ ప‌ని అప్ప‌గించినా.. పార్టీలోచిత్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. అంతా మొక్కుబ‌డిగా సాగుతోంద‌ని.. మ‌న‌సు పెట్టి చేయ‌డం లేద‌ని.. నాయ‌కులు అంటున్నారు. ఇది వాస్త‌వ‌మేన‌ని.. తాజా ప‌రిణామాలు చాటి చెబుతున్నా యి. ప్లీన‌రీకి ముందు మినీ ప్లీన‌రీలు నిర్వ‌హించారు. దీనికి ముందు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

అయితే.. వాస్త‌వానికి ఇవ‌న్నీ కూడా పార్టీ అధినేత జ‌గ‌న్ ఒత్తిడి మేర‌కు నాయ‌కులు నిర్వ‌హించార‌నేది నిర్వివాదాంశం. లేక‌పోతే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించిన వారు వీటిని నిర్వ‌హించార‌నే చెప్పాలి. ఎక్క‌డి క‌క్క‌డ ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నా.. మొక్క‌బ‌డి వ్య‌వ‌హారంగానే ముగించారు. ఎవ‌రూ మ‌నసు పెట్టి చేసింది లేదు. అయితే.. ఆ త‌ర్వాత‌..మినీ ప్లీన‌రీల ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఇక్క‌డ కూడా మ‌న‌సు పెట్టి చేసింది క‌నిపించ‌లేదు.

కేవ‌లం తూతూ.. మంత్రంగా కానిచ్చారు. మ‌రికొంద‌రు తెలివిగా.. త‌మ సమ‌స్య‌లు చెప్పుకొనేందుకు మా త్రమే మినీ ప్లీన‌రీల‌ను వాడుకున్నార‌నే వాదన ఉంది. ఇదిలావుంటే.. ఇక మ‌హా ప్లీన‌రీ ముగిసింది. భారీ ఎత్తున త‌ర‌లించారు. పెద్ద ఎత్తున భోజ‌నాలు కూడాపెట్టారు. అయితే.. ఇక‌, త‌ర్వాత ఏంటి? జ‌గ‌న్ స్ఫూర్తిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ఎవ‌రు కంక‌ణం క‌ట్టుకున్నారు? ఎవ‌రుముందుకు సాగుతున్నారు? ఎవ‌రు.. ఈ వ్యూహాన్ని అమ‌లు చేస్తారు? అనేది మ‌ళ్లీ తెర‌మీదికి వ‌చ్చింది.

ఎందుకంటే.. ప్లీన‌రీతోనే అంతా అయిపోయిన‌ట్టుగా.. నాయ‌కుడు.. స‌ర్దుకున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర మం కూడా మూల‌న‌ప‌డింది. ప్ర‌జ‌ల‌నుక‌లిసేందుకు నాయ‌కుల‌కు వ‌ర్షాలు ఆటంకాలు క‌లిగిస్తున్నాయి. మ‌రికొంద‌రు వ్యాపార వ‌త్తిడితో పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిపోయారు. దీంతోఎక్క‌డిక్క‌డ‌.. మ‌ళ్లీ వైసీపీ నాయ‌కులు.. సైలెంట్ అయిపోవ‌డం.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై క‌నీసం దృష్టి కూడా పెట్ట‌లేక పోవ‌డం.. వంటివివివాదానికి దారితీస్తున్నాయి. ప్లీన‌రీ అయిపోయింది క‌దా! అని నాయ‌కులు రెస్టు తీసుకుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share post:

Latest