రెబల్ స్టార్ నుంచి పానిండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేసిన `రాధే శ్యామ్` చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అలాగే మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాలను చేస్తున్నాడు.
వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి అవ్వగా.. మిగిలిన రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. సినిమా విషయాలు పక్కన పెడితే.. మన డార్లింగ్ తాజాగా ఓ అరుదైన ఘనత సాధించాడు. 2021 ఏడాదికి గానూ నెం. 1 సౌత్ ఏషియన్ సెలబ్రెటీగా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడు.
మీడియాతో పాటు సోషల్ మీడియాపై కూడా అత్యధిక ప్రభావం చూపిన టాప్ 50 మంది సౌత్ ఏషియన్ ప్రముఖులను యుకే దేశపు ఈస్టర్న్ ఐ వీక్లి అనే వెబ్‌సైట్ ఎంపిక చేయగా.. అందులో ప్రభాస్ మొదటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ విషయాన్ని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బి తబ్బి పోతున్నారు. అంతేకాదు, తమ డార్లింగ్ ముందు ఇండియన్ హీరోలందరూ బాలాదూర్ అని, ప్రభాస్ సాధించిన ఈ ఘటన టాలీవుడ్‌కే గర్వ కారణం అని కామెంట్లు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు మారు మోగిపోతోంది.