ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు.
అలాగే సునీల్, అనసూయ, జగపతిబాబులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా ఒక్కో అప్డేట్‌ను వదులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు.
ఈ విషయాన్ని అధికారికంగా తెలిపిన చిత్ర యూనిట్.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో కూడా అనౌన్స్ చేసింది. డిసెంబర్ 12న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
Before the MASS PARTY in theatres, a glimpse of how huge the MASS celebrations would be 🤘#PushpaMASSivePreReleaseParty on 12th Dec 💥💥#PushpaTheRise#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @resulp @adityamusic @shreyasgroup pic.twitter.com/54qOauibo9
— Mythri Movie Makers (@MythriOfficial) December 9, 2021