`శ్యామ్ సింగ‌రాయ్‌` టీజ‌ర్‌కి డేట్ లాక్‌..!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Shyam Singha Roy Movie (2021): Cast | Teaser | Trailer | Songs | Release Date - News Bugz

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్ తాజాగా శ్యామ్‌ సింగ‌రాయ్ టీజ‌ర్‌కి డేట్ లాక్ చేసింది.

The Trident of Shyam Singha Roy

నవంబర్ 18 వ తేదీన ఈ చిత్రం టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌ను సైతం వ‌దిలింది. ఆక‌ట్టుకుంటున్న ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ మరియు మలయాళ భాష‌ల్లోనూ రిలీజ్ కానున్న ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.

https://twitter.com/NameisNani/status/1458759019246456842?s=20