`ఆర్ఆర్ఆర్‌` మూడో సాంగ్ వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించబోతుండ‌గా..అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Rajamouli announces: 07.01.2022 It is RRR Release date

ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. తాజాగా సెకెండ్ లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. `నాటు..నాటు..` అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటూ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

RRR: Ram Charan and Jr NTR soak in the festive spirit of Ugadi in new poster

అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. `ఆర్ఆర్ఆర్‌` మూడో సాంగ్ విడుద‌ల‌కు కూడా మేక‌ర్స్ డేట్ ఖరారు చేశార‌ట‌. ఈ నెల 18వ తేదీన మూడవ సాంగ్ ను వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఇదే నిజ‌మైతే.. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.