పుష్ప సినిమాకు కూడా తప్పని లీకుల బెడద..వీడియో వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, గ్లామర్ క్వీన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా డేట్ దగ్గర పడడంతో సినిమా ప్రమోషన్లు శరవేగంగా జరుపుతున్నారు.

ఇక పుష్ప సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. అయితే పుష్ప మేకర్ లీకుల సమస్య పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక ఫోటోనో.. వీడియో నో బయటకు వస్తూనే ఉంటోంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి లీక్ అయిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది.

ఇక ఈ పాటలో 1000 మంది డాన్సర్లు తో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక అంతే కాకుండా రంగుల రంగుల పొగల మధ్య నుంచి అల్లు అర్జున్ స్టెప్పులతో కొట్టేస్తున్నాడు. అందులో బ్యాక్గ్రౌండ్ గా “హే బిడ్డా ఇది నా అడ్డా” అని బీట్ వినపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

https://youtu.be/amwBXLuGtfA?t=1