బాస్‌కు మాస్ తోడవుతాడా.. ఇక టాపు లేవడం ఖాయం!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో చిరు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ప్రారంభిస్తున్నాడు. ఇప్పటికే భోళాశంకర్, గాడ్‌ఫాదర్, మెగా 154 వంటి ప్రాజెక్టులను ఆయన పట్టాలెక్కిస్తున్నాడు. ఇక మెగా 154 చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ బాబీ(కెఎస్ రవీంద్ర) డైరెక్షన్‌లో వస్తుండటంతో ఈ సినిమాలో చిరు ఎలా నటిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేయనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ కీలక కేమియో పాత్రలో మాస్ రాజా రవితేజ నటించబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఈ మాస్ కేమియో పాత్ర చాలా కీలకంగా ఉండటమే కాకుండా సినిమాకు మేజర్ టర్నింగ్ పాయింట్‌లో ఈ క్యారెక్టర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి ఎనర్జిటిక్‌గా ఉండబోయే ఈ పాత్రలో మాస్ రాజా రవితేజ అయితేనే పర్ఫెక్ట్‌గా సరిపోతాడని దర్శకుడు బాబీ అనుకుంటున్నాడు. మరి ఈ సినిమాలో నిజంగానే మాస్ రాజా నటిస్తాడా లేడా అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.