తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ సంబరాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఎంగిలిపూల బతుకమ్మ తో బుధవారం సాయంత్రం ఆడపడుచులు అందరూ ఈ సంబరాలను మొదలు పెట్టనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ ద్వారా ఆడపడుచుల అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశారు. ” ఆశ్వయుజమాసంలో తొమ్మిది రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ‘బతుకమ్మ’కు స్వాగతం. తొమ్మిది రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే
బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం. ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు” అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 6, 2021