క్రిష్ దర్శకత్వంలో సందడి చేయనున్న బాలకృష్ణ..!?

ఈ మధ్య బుల్లితెర టాక్ షోలు బాలీవుడ్ స్థాయిలో జరుగుతున్నాయి. అక్కడ టాక్ షోలు అచ్చం సినిమాల్లానే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ఫార్మాట్ లోనే సాగుతుంది. యాక్షన్, కట్ ల హంగామా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్కడ కూడా అదే పద్ధతి కొనసాగుతోంది.

ప్రముఖ దర్శకుడు క్రిష్ నేతృత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలయ్య ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేయబోతున్నారు. ప్రముఖ ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ‘ఆహా’ కోసం బాలయ్య ఓ టాక్ షో నిర్వహించడానికి రంగంలోకి దిగబోతున్నారు. అయితే ‘ఆహా’ మెగా ఫ్యామిలీ వెంచర్. అయినప్పటికీ అలాంటి వెంచర్ లో బాలయ్య కూడా భాగం అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా బాలకృష్ణ ఇంటర్వ్యూలు కూడా టిపికల్ గా ఉండడంతో , ఆయన ఫాన్స్ నే కాకుండా, నాన్ బాలయ్య ఫాన్స్ కి కూడా మంచి వినోదం పంచి పెడుతుంటాయి . ఇప్పుడు బాలయ్య ఓ టాక్ షో నిర్వహించడం గమ్మతైన ఆలోచన అని టాక్ వినిపిస్తోంది.