భీమ్లా నాయక్ కోసం నిత్యామీనన్ పారితోషికం అంతేనా..?

మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ఇద్దరూ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాగర్. కె. చంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎక్కువగా రెమ్యునరేషన్ గురించే మాటలు వినిపిస్తున్నాయి.

 

ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నిత్యమీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నిత్యామీనన్ ఎంత పారితోషికం అందుకుంటోంది అనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఇకపోతే ఈ సినిమాకు ఈమె కేవలం 85 లక్షల రూపాయలను మాత్రమే పారితోషికంగా అందుకుంటోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు ఏకంగా 50 కోట్ల రూపాయలను పారితోషికం గా అందుకుంటున్నారు. దగ్గుపాటి రానా ఈ సినిమా కోసం ఐదు కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నాడు.కానీ దగ్గుపాటి రానా ఈ సినిమా కోసం కేవలం 25 రోజులు మాత్రమే కాల్షీట్లు కేటాయించినట్లు సమాచారం.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మూడు కోట్ల రూపాయలను అందుకుంటున్నాడు. నిత్యామీనన్ కు తల్లి పాత్రలో నటిస్తున్న మరో స్టార్ హీరోయిన్ రెండు నుంచి మూడు కోట్ల రూపాయలను అందుకుంటూ ఉండటం గమనార్హం.