`పవర్ స్టార్` బిరుదు ప‌వ‌న్‌కు ఎలా వచ్చింది? ఎవ‌రిచ్చారో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. ఆయ‌న్ను మించి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. త‌న‌దైన యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీ, స్టైల్‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌కు అస‌లు `ప‌వ‌ర్ స్టార్‌` అనే బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రిచ్చారో తెలుసా..? దాని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. వివ‌రాల్లోకి వెళ్తే..

Gokulamlo Seetha (1997) - IMDb

`అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాలో తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్‌.. త‌న రెండో సినిమాను ముత్యాల సుబ్బయ్య `గోకులంలో సీత` చేశాడు. రాశి హీరోయిన్‌గా న‌టించిన ఆ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. తమిళంలో హిట్టైన ‘గోకులతై సీతై’ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన గోకులంలో సీత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

Posani Krishna Murali hospitalized?

అయితే ఈ సినిమా విడుదల స‌మ‌యంలో మేక‌ర్స్‌తో పాటుగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న పోసాని కృష్ణమురళి.. పవన్ కల్యాణ్ గురించి ప్ర‌స్తావిస్తూ పవన్ స్టార్ అని సంబోధించారు. దాంతో చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు రాసాయి. ఇక ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్‌ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేసారు. అప్ప‌టి నుంచీ ప‌వ‌న్ ప‌వ‌ర్ స్టార్‌గా కీర్తించ‌బ‌డుతున్నాడు.