బ‌న్నీకి బాలీవుడ్ స్టార్ క‌పుల్ బిగ్ షాక్..ఏమైందంటే?

September 27, 2021 at 9:30 am

బాలీవుడ్ స్టార్ క‌పుల్ రణ్‌వీర్ సింగ్‌, దీపికా పడుకోణెలు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అస‌లు ఇంతకీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Allu Arjun's Telugu film 'Pushpa' to release in two parts

ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌బోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు మ‌రో పాన్ ఇండియా మూవీ బ‌రిలోకి దిగ‌బోతోంది. టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా రూపొందుతోన్న చిత్రం ‘83’.

83 (Hindi )Official Trailer | Ranveer Singh | Kabir Khan | Coming soon  2020| Interesting Facts - YouTube

కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వ‌హించిన ఈ మూవీలో కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌, ఆయ‌న‌ భార్య పాత్రలో దీపికా కనిపించనున్నారు. ఈ సినిమాను కూడా క్రిస్మస్‌ కానుకగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. అయితే రెండు పాన్ ఇండియా చిత్రాలు ఒకేసారి విడుద‌లైతే బాక్సాఫీస్ వార్ ఓ రేంజ్‌లో ఉంటుంది. పైగా థియేట‌ర్స్ విష‌యంలోనూ క్లాష‌స్ ఏర్ప‌డ‌తాయి. అందుకే పుష్ప మేక‌ర్స్ కాస్త ఆందోళ‌న చెందుతున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

బ‌న్నీకి బాలీవుడ్ స్టార్ క‌పుల్ బిగ్ షాక్..ఏమైందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts