ప‌వ‌న్‌కు వంద ముద్దులు, మెగాస్టార్ హ‌గ్‌..ఓపెనైనా సురేఖావాణి!

సినీ న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌తో ర‌చ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేఖా వాణి.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది.

ఈ క్ర‌మంలోనే ఆలీ.. మీరు చిరంజీవిని మొదటిసారి చూడగానే ఏడ్చేశారట నిజమేనా అని ప్ర‌శ్నించాడు. అందుకు సురేఖా స్పందిస్తూ.. ఒక్కోసారి గుళ్లో దేవుడిని చూడగానే మనకు తెలీకుండానే నీళ్లు వచ్చేస్తాయి. అదేంటో..చిరుగారిని చూడాగానే కూడా కన్నీళ్లు వచ్చేశాయి. నేనలా ఏడుస్తుంటే ఆయన నా దగ్గరకొచ్చి అయ్యో! ఎందుకు ఏడుస్తున్నావ్..అని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకున్నారు అని చెప్పుకొచ్చింది.

అలాగే వంద ముద్దులు ఇవ్వాలనుకునే హీరో ఎవరున్నారు? అని ఆలీ ప్రశ్నంచ‌గా.. సురేఖా వాణి పవన్ కళ్యాణ్ పేరు ఓపెన్‌గానే చెప్పేసింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా అవుతోంది.