రాజకీయాలలోకి సోను…?

Sonu Sood

లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. ఆయన సేవలకు చాలా మంది ఫిదా అయ్యారు. తాజాగా బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్ అయితే, ఏకంగా సోనూసూద్‌ ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తూ చేసిన కామెంట్స్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ కామెంట్స్ పై సోనూసూద్ స్పందించారు. నిన్న మధ్యాహ్నం కొంతమంది సాయం కోసం సోనూ ఇంటి ముందుకు వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఇక ఇదంతా కవర్ చేయడానికి వచ్చిన ఫొటోగ్రాఫర్లకు సోనూసూద్‌ సమ్మర్ డ్రింక్స్ అందిస్తూ వారితో కాసేపు సరదాగా మాట్లాడారు.

ఈ క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్ మిమ్మల్ని ఈ దేశానికి భవిష్యత్తు ప్రధానిగా చూడాలని కొంతమంది ఆశ పడుతున్నారు. ఈ వార్త విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ? అసలు మీ స్పందన ఏమిటి ? అంటూ స్పందించమని సోనూసూద్ ను కోరాడు ఆ ఫొటోగ్రాఫర్. అతని ప్రశ్నకు సోనూసూద్ చిన్న నవ్వు నవ్వి సమాధానం చెబుతూ.. ‘నిజంగా నాకు రాజీకీయాల పై ఎలాంటి ఆసక్తి లేదు. నేను కేవలం ఒక సాధారణ వ్యక్తిగానే ఉంటూ, పేదలకు, ఆపదలో ఉన్న ప్రజలకు సేవ చేస్తాను, నాకు అల చేయడమే ఇష్టం’ అంటూ సోనూ క్లారిటీ ఇచ్చాడు.