ప్రముఖ ద‌ర్శ‌కుడి ఇంట్లో క‌రోనా కల్లోలం.. ఏకంగా..?

May 12, 2021 at 12:11 pm

దేశంలో కరోనా విలయతాండవం వల్ల చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గల్లీ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ‘దిల్‌ పే మత్‌ లే యార్‌’, ‘సిటీలైట్స్‌’, ‘సిమ్రాన్‌’ చిత్రాలతో పాటు ఇటీవల ‘స్కామ్‌ 1992’ (వెబ్‌ సిరీస్‌) తీసిన ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తా ఇంట్లో క‌రోనా కలకలం రేపింది. ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తాతో పాటు ఆయ‌న కుటుంబంలో ఆరుగురికి క‌రోనా సోకింది.

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. ” మేం సేఫ్‌గా ఉన్నాం. దయచేసి కరోనా జాగ్రత్తలు పాటించండి. మాస్కులు ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యాక్సిన్‌ వేయించుకోండి. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే వైద్యులని సంప్ర‌దించండి”అంటూ ఆయ‌న తెలిపాడు. ఈ మధ్యే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. కొందరు సినీ ప్రముఖులు కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచారు.

ప్రముఖ ద‌ర్శ‌కుడి ఇంట్లో క‌రోనా కల్లోలం.. ఏకంగా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts