పుష్ప’ నుంచి వచ్చిన సర్పరైజ్ అదిరిపోయిందిగా..!?

April 3, 2021 at 11:34 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న పుష్ప చిత్రం పై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మొదటిసారి అందాల భామ రష్మిక బన్నీ సరసన జోడిగా నటిస్తోంది. ప్రతి మూవీలో తన మేకోవర్‌ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోనున్న బన్నీ ఈ మూవీ కోసం కూడా అదే స్థాయిలో దృష్టి సారించాడు. పుష్ప మూవీలో బన్నీ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా ఫాన్స్ కు పెద్ద సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు పుష్ప టీమ్. ఏ క్రమంలో ఈ వీక్ అంతా మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వనున్నారు మేకర్స్. అప్డేట్స్ కోసం సిద్ధంగా ఉండమని ట్వీట్ చేసారు పుష్ప మూవీ మేకర్స్ . అడవిలో చేతులు కట్టేసి ముఖం పై ముసుగుతో బన్నీ పరిగెడుతున్న సీన్ ఒకటి గ్లిమ్ప్స్ రూపంలో వదిలారు మేకర్స్. వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఆగస్టు 13న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పుష్ప’ నుంచి వచ్చిన సర్పరైజ్ అదిరిపోయిందిగా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts