`వ‌కీల్ సాబ్‌`కు మ‌రో షాక్..తీవ్ర నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌?

April 3, 2021 at 11:34 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది.

విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించాల‌నుకుంది. కానీ, పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో.. ఏదైనా స్టార్ హోటల్లో అభిమానులు లేకుండానే ఈవెంట్‌ను కానిచ్చేద్దామ‌ని భావించారు. ఇక ఈ సినిమాకు అమెరికా సహా అన్ని చోట్ల బెనిఫిట్ షోలను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

దీంతో ప‌వ‌న్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు కూడా ఉండ‌వ‌ని తెలుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న క‌రోనా కేసులు దృష్ట్యా.. పోలీసులు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వ‌కుండా షాక్ ఇచ్చార‌ట‌. మిగిలిన సినిమాల మాదిరిగానే ‘వకీల్ సాబ్’ విడుదల రోజున కూడా నార్మల్ షోలు మాత్రమే ఉంటాయని పోలీసులు తేల్చి చెప్పేశార‌ట‌. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

`వ‌కీల్ సాబ్‌`కు మ‌రో షాక్..తీవ్ర నిరాశ‌లో ప‌వ‌న్ ఫ్యాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts