ఇతర గ్రహాలపై నివసించే వారికీ గుండె పరిమాణం తగ్గిపోతుందా…!?

భూమి పై నివసిస్తున్న మానవ శరీరం జీవన విధానం సమతుల్యంగా ఉంటుంది. భూ గ్రహం పై మనిషి జీవించడానికి గల గాలి నీరు నేల భూమ్యకర్షణ బలం వంటివి శరీర సమతౌల్యాన్ని కాపాడుతూ వస్తున్నాయి. అందుకే ఈ గ్రహం పైనే సమస్త జీవకోటి నివసిస్తున్నాయి. కాని ఇతర గ్రహాల పై మనిషి మనుగడకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా అనే కోణంలో ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. వారి ఆరోగ్యంలో వచ్చిన అనేక మార్పుల పై జరిపిన పరిశోధనలు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

అంతరిక్షంలో ఎక్కువ కాలం నివసిస్తున్న వ్యోమగాముల శారీరక సమతౌల్యం గురించి పరిశోధకులు అనేక ఆశ్చర్యమయిన నిజాలు చెప్పారు. ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉంటే వ్యోమగాముల గుండె క్రమంగా తగ్గిపోతుందని తెలిపారు. అక్కడ భూమ్యాకర్షణ బలం లేకపోవడం వల్ల రక్తం పాదాల వైపు ప్రయాణిస్తుందని , గుండెలోని కణాలు కణజాలాలు క్రమంగా కుచించుకుపోతున్నాయని పరిశోధకులు వివరించారు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపే వాళ్లలో గుండె క్రమంగా కుచించుకుపోతుందని పరిశోధకులు తేల్చి చెప్తున్నారు.