కరోనా భారిన పడిన త‌మిళ హీరోయిన్ …!?

త‌మిళ హీరోయిన్ గౌరీ కిష‌న్‌ కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. త‌న‌కు క‌రోనా సోకింద‌ని, మిగ‌త వారంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఇన్‌స్టా ద్వారా గౌరీ వెల్లడించింది. త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన అందరు త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని గౌరీ విజ్ఞ‌ప్తి చేసింది. ప్ర‌స్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉందని, త‌న ఆరోగ్యబాగానే ఉంద‌ని, ఎవ‌రూ భయ పడాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె తెలిపింది.

గౌరీ కిష‌న్ ఇటీవలే త‌మిళ నాట ప్రముఖ హీరో విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ సినిమాలో న‌టించింది. ఈ మూవీలో ఆమె స్టూడెంట్ లీడ‌ర్‌గా చేసింది. డైరెక్ట‌ర్ సీ ప్రేమ్ కుమార్ చిత్రీక‌రించిన 96 మూవీలో త్రిష చిన్న‌నాటి క్యారెక్ట‌ర్‌లో న‌టించింది గౌరీనే. సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన క‌ర్ణ‌న్ సినిమాలోనూ గౌరీ న‌టించింది. ఈ మూవీ ఏప్రిల్ 9న విడుదల కానుంది.