సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ..!?

టీటీడీ వారు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ. 3818/2018 హైకోర్టు తీర్పు మేరకు టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. దీంతో ప్రధాన అర్చకుడు హోదాలో తిరిగి ఆలయ ప్రవేశం చేయనున్నారు రమణ దీక్షితులు. ఇప్పుడు ఆయన తిరిగి రావటంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధానార్చకులు కొనసాగడం పై పెద్ద సందేహం నెలకొంది.

అసలు చంద్రబాబు హయాంలో అర్చకులకు, ప్రధానార్చకులు కూడా వయోపరిమితి విధిస్తూ ఆ పరిమితి దాటాక రిటైర్ అయ్యే లాగా రూల్స్ తీసుకు వచ్చారు కానీ, హైకోర్టు కు వెళ్ళిన అర్చకులు అందుకు అనుకూలంగా తీర్పు తెచ్చుకోగలిగారు. జగన్ అధికారంలోకి వచ్చాక రమణదీక్షితులు లకు సలహాదారు పదవి అప్పచెప్పారు. తాజా ఆదేశాలతో తిరిగి ప్రధాన అర్చకులు హోదాలో ఆయన తిరిగి విధుల్లో చేరాల్సి ఉంటుంది.