బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న వైల్డ్‌ డాగ్‌..!?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటించిన తాజా సినిమా వైల్డ్‌ డాగ్‌ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూలు చేస్తుంది. తొలి రోజు దాదాపు రూ. 3.5 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. ఇక యూఎస్‌ఏలో కూడా వైల్డ్‌ డాగ్‌ తొలి రోజే 3,967 డాలర్లను వసూలు చేసింది. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 70 లక్షలు, ఓవర్సీస్‌ హక్కులు రూ.50 లక్షలకు అమ్ముడు పోయినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపుతున్నాయి.

నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన ఈ సినిమాలో కింగ్‌ నాగ్‌ ఏసీపీ విజయ్‌ వర్మగా బాగా మెప్పించాడు. ఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకపోయినప్పటికీ, చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రానికి అహిషోర్‌ సాల్మన్ దర్శకత్వం వహించగా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‌పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా తదితరులు ముఖ్య పత్రాలు పోషించారు.