కార్పొరేష‌న్ పోరులో జ‌న‌సేన ఎఫెక్ట్ ఎవ‌రికి ఎంత‌..!

తెలుగునాట ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత ఆ స్థాయిలో ద‌శాబ్దాల‌పాటు సినీ అభిమానుల‌ను ఉర్రూతలూగించి తిరుగులేని అభిమాన గ‌ణాన్ని సొంతం చేసుకున్న ఘ‌నత చిరంజీవిది. ఆ ధైర్యంతోనే ఎన్టీఆర్ బాట‌లోనే తానూ సొంతంగా రాజ‌కీయ‌ పార్టీ పెట్టి ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆశించిన చిరంజీవికి రాజ‌కీయాల్లో మాత్రం గ‌ట్టి ఎదురుదెబ్బ‌నే రుచిచూడాల్సి వ‌చ్చింది. సినిమాల్లో నెంబ‌ర్ వ‌న్‌గా రాణించిన చిరంజీవి రాజ‌కీయాల్లో మాత్రం వెనుక‌బెంచీ విద్యార్థిగానే ఉండిపోయారు. చిరంజీవి రాజ‌కీయాల్నిన‌మ్ముకుని సినీరంగాన్ని వీడ‌టంతో స‌హ‌జంగానే ఆయ‌న అభిమాన గ‌ణ‌మంతా […]

రోజా బూతుల పంచాంగం అందుకేనా..!

వ‌ర్త‌మాన రాజ‌కీయాల్లో విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉండ‌టం కంటే… ప్ర‌జ‌ల‌ను ఏ స్థాయిలో న‌మ్మించ‌గ‌ల‌మ‌నేదానిపైనే త‌మ రాజ‌కీయ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న‌ది అధిక‌ శాతం రాజ‌కీయ నాయ‌కుల న‌మ్మ‌కం. అందుకే మీడియాలో రాజ‌కీయ నేత‌ల ముఖాముఖి చ‌ర్చ‌ల్లో దాదాపు మాట‌ల యుద్ధ‌మే జ‌రుగుతోంది. ప్ర‌త్య‌ర్థుల‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల చేసే విష‌యంలో కొంద‌రు నేత‌లైతే అన్నిహ‌ద్దుల‌ను ఎప్పుడో దాటేశారు. త‌మ నోటి దురుసుతో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన‌ నేత‌ల వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్న తీరు జుగుప్స క‌లిగిస్తోంది. ఇక త‌న‌ను […]

స్నేహితుడితో జ‌గ‌న్‌కు షాక్ రెడీ చేస్తోన్న లోకేష్‌

తెలుగుదేశం పార్టీలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ కొంత‌కాలంగా క్రియాశీల‌క పాత్రను పోషిస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే… లోకేష్‌కు మంత్రి ప‌ద‌వినిచ్చి పాల‌న‌లో మ‌రింత ముఖ్య పాత్ర వ‌హించే అవ‌కాశం ఇవ్వాల‌ని ఇటీవ‌ల‌ పార్టీ నుంచి గ‌ట్టి డిమాండే వ‌చ్చినా… ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌డం ఇష్టం లేని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..  ప్ర‌స్తుతానికి పార్టీ నేత‌ల‌కు సర్ది చెప్పి ఆ అంశాన్ని ప‌క్క‌న పెట్టారు. ఇదిలా ఉండ‌గా 2019 ఎన్నిక‌ల‌నాటికి అధికారం […]

2019 ఎన్నిక‌ల్లో గెలుపున‌కు జ‌గ‌న్ వ్యూహం ఇదే

ఏపీలోని ఏకైక విప‌క్షం జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపా.. ఎట్టిప‌రిస్థితిలోనూ 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది. వాస్త‌వానికి 2014లోనే అత్య‌ధిక మెజారిటీతో వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌ని అంద‌రూ భావించారు. దీనికి అనుకూలంగానే అనేక విశ్లేష‌ణ‌లు, స‌ర్వేలు కూడా వ‌చ్చాయి. అయితే, అనూహ్యంగా చంద్ర‌బాబు ఇచ్చిన డ్వాక్రా రుణ‌మాఫీ, రైతురుణ మాఫీలు సైకిల్ స‌వారీ చేయ‌డానికి, టీడీపీ అధికారంలోకి రావ‌డానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డాయి. అంతేకాదు, టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి అటు బీజేపీతో […]

బాబుకు ఆ ముగ్గురు యాంటీ అవుతున్నారా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు విప‌క్షాల నుంచే కాకుండా మిత్ర ప‌క్షం అనుకుంటున్న జ‌న‌సేనాని నుంచి కూడా కాక త‌గ‌ల‌నుందా?  అటు ప్ర‌ధాన విప‌క్షం వైకాపా, కామ్రేడ్లు స‌హా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూకుమ్మ‌డిగా బాబుపై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారా?  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన గోదావ‌రి ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చంద్ర‌బాబు కొంప‌మీద‌కు వ‌స్తోందా? అంటే ఔన‌నే స‌మాధానాలే వ‌స్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా మ‌త్య్స కారుల‌కు అనువైన స‌ముద్ర ఉత్ప‌త్తుల […]

టీడీపీ నేత‌ల బ‌హు భార్య‌ల లెక్క‌లు చెప్పిన వైకాపా

ఏపీ సీఎం చంద్ర‌బాబు అవాక్క‌య్యే విష‌యాన్ని వైకాపా నేత‌లు వెల్ల‌డించారు. అక్క‌డెక్క‌డో ఉన్న అమెరికా పౌరులు ఎంజాయ్ మెంట్ కోసం పెళ్లిళ్లు చేసుకుంటార‌ని, వాళ్ల‌కి కుటుంబ సంతోషం ఏమిటో తెలీద‌ని నిన్న వెల‌గ‌పూడిలోని తాత్కాలిక స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్ ప్రారంభం సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు కామెంట్లు కుమ్మ‌రించారు. ఈ సంద‌ర్భంగానే ప్ర‌స్తుతం అమెరికా అధ్య‌క్ష రేసులో పోరాడుతున్న ట్రంప్ గురించి మాట్లాడుతూ.. ఆయ‌న‌కు ప్ర‌స్తుతం ఉన్న భార్య నాలుగో వ్య‌క్తి అని అనుకుంటున్న‌ట్టు చెప్పారు. ఇలాంటి […]

వైకాపాలో గ్రూపుల గోల‌

ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైకాపా నిర్ణ‌యాత్మ‌క పాత్ర పోషించ‌లేక పోతోందా?  వైకాపా నేత‌లు త‌మ‌లో తామే గొడ‌వ‌లు ప‌డుతూ పార్టీ ప‌రువును బ‌జారుకు ఈడుస్తున్నారా?  ఆధిప‌త్య ధోర‌ణి పెరిగిపోతోందా?  వీరిని లైన్‌లో పెట్టాల్సిన వైకాపా అధినేత జ‌గ‌న్‌.. మౌనం పాటిస్తున్నారా?  వైకాపాను న‌డిపించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారా? అంటే ఔన‌నే అంటున్నారు అనంత‌పురం వైకాపా నేత‌లు! ఈ జిల్లాలో వైకాపాకు సంఖ్యా బ‌లం ఎక్కువ‌గానే ఉంది. అయితే, ఎవ‌రికి వారిలో ఆధిప‌త్య ధోర‌ణి పెరిగిపోవ‌డంతో నిత్యం ఏదో ఒక […]

వైకాపాలోకి టీడీపీ ఎంపీ!

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరి.. ఎంపీ అయిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు ప్ర‌తిప‌క్ష వైసీపీలో చేరేందుకు పావులు క‌దుపుతున్నారు. టీడీపీలో చేరిన స‌మ‌యంలో త‌న‌కు ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కేయడం, అక్క‌డే ఉంటే త‌న‌కు ఎదుగుద‌ల ఉండ‌ద‌ని భావించి ఈ మేర‌కు అన్నీ సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. అంతేకాదు వైసీపీలో చేరేందుకు కొన్ని కొండీష‌న్స్ కూడా పెడుతున్నారు. వాట‌న్నింటికీ ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్ సిద్ధ‌మంటే వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు రెడీ అంటున్నారు! ఆ ఎంపీ […]

ఇంటిలిజెన్స్ స‌ర్వేతో హ‌డ‌లెత్తుతున్న టీడీపీ!

ఏ విష‌యంపైనైనా వ్య‌క్త‌ల‌పైనైనా స‌ర్వే చేయించే సీఎం చంద్ర‌బాబు ఆయా స‌ర్వేల్లో వ‌చ్చిన రిజ‌ల్ట్ ఆధారంగా కార్య‌చ‌ర‌ణ రూపొందించుకుంటుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప‌నితీరు స‌హా సీఎంగా ఆయ‌న ప‌నితీరుపైనా స‌ర్వే చేయించుకున్నారు. ఆయా రిజ‌ల్ట్స్‌ని బ‌ట్టి ప‌నితీరును మెరుగు ప‌రుచుకుని ప్ర‌జ‌ల్లో ఇమేజ్ సంపాదించాల‌ని బాబు ప్లాన్‌. అదే విధంగా త్వ‌ర‌లో రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న మునిసిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది?  విజ‌యం సాధిస్తామా లేదా? అనే కోణంలో […]