పాద‌యాత్ర‌కు రెడీ అవుతోన్న జ‌గ‌న్‌…

తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌కు, నేత‌ల పాద‌యాత్ర‌ల‌కు అవినాభావ సంబంధం ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 2003లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి రాష్ట్ర‌వ్యాప్తంగా  దాదాపు 1600 కిలోమీట‌ర్ల దూరం చేప‌ట్టిన పాద‌యాత్ర ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్‌ను తేవ‌డ‌మే కాదు… ఆనాటికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇత‌ర నేత‌లంద‌రినీ వైఎస్ ముందు మ‌రుగుజ్జులుగా మార్చేసి ఆయ‌న‌ను ఏకంగా సీఎం పీఠం ఎక్కించేసింది. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల ముందు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం ఆరుప‌దులు దాటిన వ‌య‌సులో […]

జ‌గ‌న్‌కు టెన్ష‌న్‌గా మారిన బావ – బావ‌మ‌రుదులు

రాయ‌ల‌సీమ‌లోని క‌డ‌ప క‌ర్నూలుతోపాటు ఆ స్థాయిలో వైసీపీకి బ‌ల‌మైన జిల్లాలుగా నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌ను చెప్పుకోవ‌చ్చు. అయితే ఇటీవ‌ల కొద్దికాలంగా ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ గ్రాఫ్ అంత‌కంత‌కూ దిగజారుతోంది. దీనికి అధికార పార్టీ అనుస‌రిస్తున్న‌గొప్ప‌రాజ‌కీయ వ్యూహాలు కార‌ణ‌మ‌ని ఎవ‌రైనా అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే..  అవును మరి… స్థానికంగా ఉన్న ఇద్ద‌రు వైసీపీ నేత‌ల ఆధిపత్య పోరే  ఇక్క‌డ వైసీపీకి శాపంగా మారింది. ఇంతా చేసి మ‌నం చెప్పుకునే వ్య‌క్తులు రాజకీయ ప్రత్యర్థులు కాదు.. వారికి వ్యక్తిగత గొడవలు […]

ఏపీలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై కొత్త చ‌ర్చ‌

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌పై కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తం 11 మునిసిపాలిటీలు, 5 కొర్పొరేష‌న్ల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ రానున్న రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. వాస్త‌వానికి న‌వంబ‌రు 30లోగా దీనిపై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని త‌మ‌కు చెప్పాల‌ని హైకోర్టు ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం స‌మాయత్తం అవుతోంది. అయితే, 2014 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్రంలో జ‌రుగుతున్న తొలి ఎన్నిక‌లు కావ‌డం, […]

వైకాపాలో సినీ గ్లామ‌ర్ పెరుగుతోందా..

ఏపీ ఏకైక విప‌క్షం వైకాపాలో సినీ గ్లామ‌ర్ పెరుగుతోంది. మాజీ హీరోయిన్ రాశి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ గూటికి చేరేందుకు అన్ని ప్ర‌య‌త్నాలూ పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. ఇక, ముహూర్త‌మే త‌రువాయి అన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి చంద్ర‌బాబు పార్టీ టీడీపీతో పోల్చుకుంటే వైకాపాకి సినీ గ్లామ‌ర్ చాలా త‌క్కువ‌. ఒక్క రోజా త‌ప్ప ఆపార్టీలో సినీ గ్లామ‌ర్ ఉన్న వాళ్లు లేరు. గ‌తంలో ఎప్పుడో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ జ‌గ‌న్ పంచన ఉన్నా. అది ముగిసిన ముచ్చ‌ట‌. ఇప్ప‌టికైతే.. రోజా […]

2019 ఎల‌క్ష‌న్స్‌కు జ‌గ‌న్ షాకింగ్ యాక్ష‌న్ ప్లాన్‌

ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా విజ‌యం మాదే అని ప‌దేప‌దే చెప్పే జ‌గ‌న్‌.. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని కూడా చెబుతుంటారు. ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని కూడా ఆయ‌న ప్ర‌చారం చేస్తుంటారు. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. 2014లోనే ఏపీలో అధికార పీఠాన్ని ద‌క్కించుకునేందుకు ఎంతో ప్ర‌యాస ప‌డ్డారు. అయినా ప్ర‌జ‌లు బాబు వైపే మొగ్గు చూపారు. ఇక‌, ఈ క్ర‌మంలో 2019 ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ క‌న్నేశారు. ఎట్టిప‌రిస్థితిలోనూ […]

పేప‌రు వైకాపా నేత‌ది…భ‌జ‌న బాబుది

గ‌తంలో ఓ వెలుగు వెలిగినా ప్ర‌స్తుతం చిన్న‌ప‌త్రిక‌ల స్థాయికి ప‌డిపోయిన ఓ ప‌త్రికా సంస్థ అనుస‌రిస్తున్న రాజ‌కీయ వ్యూహం ఏమిటో ఎవ‌రికీ అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే స‌ద‌రు ప‌త్రికా య‌జ‌మాని  కొంత కాలం కిందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గతంలో ఈయ‌న‌గారికి మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. త‌న‌యుడికి రాజ‌కీయంగా భవిష్య‌త్తు ఉంటుందన్నఆశ‌తో ఆపార్టీలో చేరిన స‌ద‌రు నేత‌  ఆ మేర‌కు కొడుక్కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కాకినాడ […]

ప‌వ‌న్ బాట‌లో జ‌గ‌న్‌

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్లు ఉండ‌గానే  ప్ర‌స్తుతం ఏపీలో బ‌హిరంగ స‌భ‌ల రాజ‌కీయాల వేడి మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి దీనికి తెర‌దీసింది మాత్రం.. ఇంకా రాజ‌కీయాల్లో పార్ట్ టైం పాత్ర‌ను మాత్ర‌మే పోషిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే చెప్పాలి.  రాజ‌కీయాల‌పై త‌న దిశ ద‌శ ఎలా ఉండ‌బోతున్నాయో ప్ర‌జ‌ల‌కు స‌వివ‌రంగా చెప్పేందుకంటూ ఆయ‌న తిరుప‌తిలో తొలిసారిగా బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. ఆ త‌రువాత కేంద్రం… ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ కాకినాడ‌లో మ‌రో స‌భ నిర్వ‌హించారు. […]

ఏపీలో జంపింగ్‌ల‌కు షాక్ త‌ప్ప‌దా

వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీలోకి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు పెద్ద ఎత్తున షాక్ త‌గ‌ల‌నుంది. అప్ప‌ట్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు విసిరిన ఆక‌ర్ష్ దెబ్బ‌కి ఒక్క‌రొక్క‌రుగా జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇచ్చి మ‌రీ సైకిల్ ఎక్కేశారు. వీరిలో పెద్ద‌తల‌కాయ‌లు గా భావించిన వారికి చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వులు ఇస్తాన‌ని అప్ప‌ట్లోనే హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా కేబినెట్‌లో ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న మైనార్టీ శాఖ మంత్రి ప‌ద‌వి స‌హా ప‌లువురికి అమాత్య పీఠాలు అప్ప‌గిస్తాన‌ని బాబు హామీ ఇచ్చార‌ని […]

ఏపీలో వైకాపా-కాంగ్రెస్ క‌లుస్తాయా..!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ ఫ‌లితాలు దేశ‌రాజ‌కీయ ముఖ చిత్రాన్నేమార్చిన ఘ‌ట‌న‌లు గ‌తంలో చాలానే ఉన్నాయి. హ‌స్తిన పీఠాన్నికాంగ్రెస్‌కు దూరం చేసిన జాతీయ స్థాయి విప‌క్ష కూట‌మి ఏదైనా.. అందులో టీడీపీ పోషించిన కీల‌క పాత్ర‌ను గుర్తుకు తెచ్చేదే. ఒక‌ర‌కంగా కాంగ్రెస్ పార్టీ పంతం ప‌ట్టి మ‌రీ రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించ‌డానికి కూడా టీడీపీ మీద, ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు పైనా.. ఆ పార్టీలో పేరుకుపోయిన క‌క్షే కార‌ణమ‌ని భావించేవారి సంఖ్య త‌క్కువేమీ కాదు.  రాష్ట్ర విభ‌జ‌న […]