సీఐడీ డీజీ బ‌దిలీ వెనుక వైసీపీలో ఒక్క‌టే గుస‌గుస‌లు…!

సీఐడీ డీజీ.. ఆ విభాగం చీఫ్ సునీల్ కుమార్‌ను అనూహ్యంగా సీఎం జ‌గ‌న్ కొన్ని రోజుల కింద‌ట త‌ప్పించా రు. అయితే.. ఆయ‌న‌ను ఎందుకు ఆ పోస్టు నుంచి త‌ప్పించారు? అనేది మాత్రం మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న గానే మిగిలిపోయింది. దీనిపై అనేక విశ్లేష‌ణ‌లు కూడా వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న‌కు డీజీపీగా ప‌దోన్న‌తి క‌ల్పించ‌నున్నార‌ని కూడా కొంద‌రు పేర్కొన్నారు. అయితే.. దీనికి మ‌రో కార‌ణం.. మౌలిక‌, కీల‌క కార‌ణంపై తాడేప‌ల్లి వ‌ర్గాలు భిన్నంగా రియాక్ట్ అవుతున్నాయి. ఒక‌టి.. […]

గుంటూరు మంత్రులు డేంజర్ జోన్‌లో..ముగ్గురికి చెక్?

అధికార వైసీపీలో మంత్రుల పాత్ర అభివృద్ధి చేయడం కంటే..ప్రతిపక్ష నాయకులని తిట్టడమే ఎక్కువనే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఏ మంత్రి అయినా ప్రెస్ పెడితే..వారి శాఖలకు సంబంధించి మాట్లాడటం తక్కువగా కనిపిస్తోంది..ఎంతసేపు ప్రతిపక్ష నేతలని తిట్టడానికే ప్రెస్ మీట్లు పెట్టడమే అన్నట్లు ఉంది. అసలు మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి పనుల గురించి మాట్లాడటం కనిపించడం లేదు. దీంతో మంత్రులు ఏ శాఖ బాధ్యతలు చూసుకుంటున్నారో ప్రజలకు క్లారిటీ ఉండటం లేదు. దీని వల్ల […]

ఐప్యాక్‌ సర్వేతో టెన్షన్..క్లారిటీ వచ్చినట్లే.!

అధికార వైసీపీకి సర్వేల టెన్షన్ పెరిగిపోయింది..ఇటీవల బయటకొచ్చే ప్రతి సర్వే కూడా వైసీపీకి నెగిటివ్ గానే ఉంటుంది. వైసీపీ బలం ఎక్కువ తగ్గిందని, చాలా సీట్లు కోల్పోయిందని సర్వేల్లో వస్తుంది. ఇదే క్రమంలో వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్న ఐప్యాక్ టీమ్ సర్వే కూడా బయటకొచ్చిందని తాజాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది కూడా మంత్రులు, మాజీ మంత్రులకు సంబంధించిన సర్వే వెలువడింది. ఇక దీనిపై మీడియా కూడా పెద్ద ఎత్తున కథనాలు […]

కొడాలికి ఎదురులేనట్లేనా..గుడివాడలో టీడీపీకి డౌటే?

గుడివాడలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ గెలుపు అవకాశాలు కనిపించడం లేదా? ఈ సారి కూడా కొడాలి నాని సత్తా చాటడం ఖాయమేనా? ప్రస్తుతం గుడివాడలో జరుగుతున్న రాజకీయం బట్టి చూస్తే ఈ సారి కొడాలి గెలుపు మాత్రం అంత సులువు కాదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈజీగా కొడాలి గెలవడం కష్టమే. కాకపోతే ఇప్పటికీ గుడివాడలో కొడాలి లీడ్ లోనే ఉన్నారని తెలుస్తోంది. ఆ ఆధిక్యాన్ని తగ్గించగలిగితేనే..గుడివాడలో టి‌డి‌పి గెలవగలదు. ఈ మధ్య వచ్చిన […]

పుంగనూరు పాలిటిక్స్..పెద్దిరెడ్డిపై పోటీకి మరోనేత!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య దశబ్ద్లాల కాలం నుంచి రాజకీయ వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ వైరం ఇప్పుడు మరింత ఎక్కువైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి మరింతగా చిత్తూరుపై ఫోకస్ చేసి టీడీపీని దెబ్బతీసేలా ముందుకెళుతున్నారు. అటు చంద్రబాబు కంచుకోట కుప్పంపై కూడా ఎలా ఫోకస్ చేశారో చెప్పాల్సిన పని లేదు. అక్కడ రాజకీయంగా బాబుని దెబ్బతీయాలని చూస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా రివర్స్ ఎటాక్ […]

పవన్ దూకుడు..బీజేపీ నేతతో కయ్యం.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్..అధికార వైసీపీపై పోరుని ఉదృతం చేశారు. తనదైన శైలిలో ఆవేశంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ మధ్య శ్రీకాకుళం సభలో వైసీపీని, పలువురు మంత్రులని గట్టిగా టార్గెట్ చేసిన పవన్..తాజాగా మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో…వైసీపీ విధానాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల సొంతమని అర్థమని, వైసీపీ సొంతమని కాదు… సజ్జల సొంతమని కాదని,  మనందరి సొంతమని అన్నారు. అదే సమయంలో ఒకసారి వామపక్షాలతో వెళ్తావు… మరోసారి బీజేపీతో […]

లోకేష్ పాదయాత్ర షురూ..టీడీపీకి అధికారం దక్కుతుందా!

నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది..మరి కొన్ని గంటల్లో కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. అయితే అనేక ఆంక్షల మధ్య లోకేష్ పాదయాత్ర ప్రారంభవుతుంది. అయితే ఈ ఆంక్షల్లో సడలింపులు దొరుకుతాయా? లేక అవేమీ పట్టించుకోకుండా పాదయాత్ర ముందుకెళుతుందా? అనేది చూడాల్సి ఉంది. ఆ విషయం పక్కన పెడితే..పాదయాత్ర ద్వారా టీడీపీని అధికారంలోకి తీసుకు రాగలరా లేదా? అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో దారుణంగా ఓడి ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీని కొంతమేర చంద్రబాబు […]

తణుకులో టీడీపీకి ఎడ్జ్..మంత్రికి కష్టమేనా?

గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టి‌డి‌పి చాలా తక్కువ మెజారిటీలతో ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు కూడా ఒకటి. కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఇక్కడ టి‌డి‌పి ఓటమి పాలైంది. అయితే ముందు నుంచి తణుకులో టి‌డి‌పికి కాస్త బలం ఉండేది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా గెలిచింది..2004, 2009 ఎన్నికల్లో ఓడిపోగా, మళ్ళీ 2014 ఎన్నికల్లో గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో కూడా ఈ […]

అటు సామినేని-ఇటు పవన్..వెల్లంపల్లికి షాక్ తప్పదా?

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో అటు టి‌డి‌పిలో వర్గ పోరు ఉంటే..ఇటు వైసీపీలో కూడా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు అనుకూల వాతావరణం కనిపించడం లేదు. ఆయన చేసే రాజకీయమే చివరికి ఆయనకే రివర్స్ అయ్యేలా ఉంది. గత ఎన్నికల్లో టి‌డి‌పిలో గ్రూపు రాజకీయం, జనసేన ఓట్లు చీల్చడం వల్ల 7 వేల ఓట్ల మెజారిటీతో వెల్లంపల్లి వైసీపీ నుంచి గెలిచారు. అలాగే మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మంత్రిగా ఉన్నప్పుడు ఈయనపై ఎన్ని ఆరోపణలు వచ్చాయో తెలిసిందే. తర్వాత మంత్రి […]