నంద్యాల‌లో ఆ ఓటింగ్ సానుభూతికా… వ‌్య‌తిరేకానికా..!

నంద్యాల‌లో పోలింగ్ ముగిసింది. ఓట‌రు తీర్పు ఎలా ఉంటుందో ?  ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. సాధార‌ణంగా ఉప ఎన్నిక అంటే ఓట‌ర్లు పెద్ద ఇంట్ర‌స్ట్ చూప‌రు. ఎవ‌రి ప‌నుల్లో వారు నిమ‌గ్నమైపోతారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా జ‌రిగింది. 80 శాతానికి కాస్త అటూ ఇటూగా పోలింగ్ న‌మోదైంది. ఓవ‌రాల్‌గా 79.20 శాతం పోలింగ్ జ‌రిగింది. 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో 72.09 శాతం ఓటింగ్ న‌మోదు అయితే […]

అటు అభివృద్ధి.. ఇటు అన్యాయం.. నంద్యాల ఓట‌రు తిక‌మ‌క‌!

నంద్యాల ఉప ఎన్నిక మంచి ఊపుమీదుంది. గ‌తంలో ఎన్నిడూ లేనంత‌గా ఎన్నిక ప్రారంభం అయి రెండు గంట‌లు గ‌డిచాయో లేదో దాదాపు 16% పోలింగ్ న‌మోదైంది. అది కూడా ఓ ఉప ఎన్నిక‌లో కావ‌డంతో ఎన్నిక‌ల సంఘంలో త‌లు పండిన సీనియ‌ర్లు సైతం ఆశ్చ‌ర్య పోతున్నారు. ఇంత వెల్లువ‌లా నంద్యాల ఉప పోరు జ‌రుగుతుంద‌ని వారు అస్స‌లు ఊహించ‌లేదు. ఇంకో మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర ప‌రిణామం ఏంటంటే.. మంచంలోంచి లేచి తిర‌గ‌లేని ప‌రిస్థితిలో కాటికి కాళ్లు చాపుకున్న వారు […]

జ‌గ‌న్‌పై కేసు న‌మోదుకు ఈసీ ఆదేశం

ఏపీ విప‌క్ష నేత‌గా బాధ్య‌తా యుత స్థానంలో ఉండి.. న‌లుగురికీ ఆద‌ర్శంగా రాజ‌కీయాలు చేయాల్సిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. నోటి దుర‌ద కార‌ణంగా కోరి క‌ష్టాలు కొని తెచ్చుకున్నారు. అది కూడా తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న నంద్యాల ఉప పోరుకు ఎన్నిక జ‌రుగుతు స‌మయంలో కావ‌డంతో ఫ‌లితంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. విష‌యంలోకి వెళ్తే.. నంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించేందుకు ముందు టీడీపీలో క్రియాశీల‌కంగా ఉన్న శిల్పా బ్ర‌ద‌ర్స్‌ని వైసీపీలోకి ఆహ్వానించి టికెట్ […]

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ..వైసీపీ వెర్ష‌న్ ఒకలా.. టీడీపీ వెర్ష‌న్ మ‌రోలా

తెలుగు జ‌నాలు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తోన్న  ఏపీలోని నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ బుధ‌వారం తీవ్ర ఉత్కంఠ మ‌ధ్ స్టార్ట్ అయ్యింది. ఉద‌యం 7 గంట‌ల‌కే ప్రారంభ‌మైన పోలింగ్ 10 గంట‌ల‌కే అన‌ధికారికంగా 22 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. నంద్యాల ఓట‌రు మంచి హుషారుగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు బూత్‌ల వ‌ద్ద బారులు తీరారు. ఇక నంద్యాల రూర‌ల్‌, గోస్పాడు మండ‌లాల్లో కొన్ని గ్రామాల్లో అయితే 10 గంట‌ల‌కే 40-50 […]

టార్గెట్ : ముస్లింలు వైసీపీకి దూరం… అందుకే పొత్తు క‌థ‌నాలు!

ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు విమ‌ర్శ‌లే ఒక్కొక్క‌సారి ప‌నిచేయ‌వు.. వారిని దెబ్బ‌కొట్టేందుకు అనేక మార్గాలుంటాయి. అలాంటి మార్గాల‌ను బాగా ఒంట‌బ‌ట్టించుకున్న ఎల్లో మీడియా..  వాటిని ఆధారంగా చేసుకునే వైసీపీని చావు దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌య‌త్నించింది. తాజాగా నంద్యాల పోరు పీక్ స్టేజ్‌కి చేరిపోయిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య గెలుపు ఓట‌ములు కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల మీద‌నే ఆధార‌ప‌డ్డాయి. ఈ వ‌ర్గం వారు ఎటు మొగ్గితే ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించేందుకు అవ‌కాశం ఉంది.  అయితే, […]

బాబు జ‌మానాలో జ‌గ‌న్ గూఢ‌చారులు?

అవును! ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌మానాలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు గూఢ‌చారులు ఉన్నార‌ట‌! వీరు ప్ర‌భుత్వంలో జ‌రిగే ప్ర‌తి విష‌యాన్నీ పూస‌గుచ్చిన‌ట్టు ముందుగానే జ‌గ‌న్ అండ్‌కోకి అందించేస్తున్నార‌ట‌. అంతేకాదు, ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌లు, కొన్ని అతి ర‌హ‌స్య‌, అత్యంత ర‌హ‌స్య‌ నిర్ణ‌యాల‌ను కూడా వీరు జ‌గ‌న్ ప‌రివారానికి మోసేస్తున్నార‌ట‌! ఈ క్ర‌మంలోనే అనేక ర‌హ‌స్య జీవోలు, ముఖ్యంగా ఉద్యోగుల‌ను తొల‌గిస్తార‌ని, వారికి పెర‌ఫార్మెన్స్ ఆధారంగా ఇంటికి సాగ‌నంపుతార‌ని, పురోహితుల‌కు జీతాలు త‌గ్గిస్తార‌ని ఇటీవ‌ల జ‌గ‌న్ ప‌త్రిక సాక్షిలో అనేక […]

వైసీపీలో పెరుగుతున్న ఒక వర్గం పెత్తనం …అసంతృప్తిలో మిగతా కులాలు

రాజ‌కీయాలు ఒక‌ప్పుడు నేత‌ల‌ను బ‌ట్టి మారుతుండేవి. కానీ, ప్ర‌స్తుతం ట్రెండు మారింది. కులాల కార్డులే పార్టీల‌ను, రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. అచ్చం ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే విప‌క్షం వైసీపీ విశాఖ‌ప‌ట్నంలో ఎదుర్కొంటోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కులం త‌గాదాలు మిన్నుముట్టాయ‌ట‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాపులు త‌మ రిజ‌ర్వేష‌న్ కోసం ఉద్య‌మాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారిని చేర‌దీయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ప్ర‌యోజనం ఉంటుంద‌ని భావించిన వైసీపీ.. నేత‌లు విశాఖ‌లో ఈ వ‌ర్గాన్ని చేర‌దీశార‌ట‌.  […]

జ‌ట్టుక‌ట్ట‌నున్న వైసీపీ-బీజేపీ.. బాబుకు థ్రెట్టేనా?

ఏపీ రాజ‌కీయాలు రంగు మారుతున్నాయా? 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోతున్నాయా? నిన్న‌టి వ‌ర‌కు తిట్టిపోసిన వాళ్ల‌నే అక్కున చేర్చుకుని ఆద‌రించేందుకు పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయా? ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన మిత్రుల‌కు బైబై చెప్పేందుకు కూడా రెడీ అవుతున్నాయా? అంటే ఔన‌నే అంటున్నారు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు ఆర్ణ‌బ్ గోస్వామి!! రెండు పార్టీల‌కు ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్యాలే ఇక‌పై ఏపీని శాసించ‌నున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆ పార్టీల్లో ఒక‌టి వైసీపీ, రెండు బీజేపీ. ఈ రెండు పార్టీలూ […]

కేంద్ర నిఘా సంస్థ‌ల నివేదిక‌లో నంద్యాల‌లో వైసీపీ మెజార్టీ లెక్క ఇదే

నంద్యాల.. నంద్యాల‌.. నంద్యాల‌..! క‌ర్నూలు జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌పై ఇప్పుడు అంద‌రి దృష్టీ ప‌డింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డ అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు ఎవ‌రికి వారు త‌మ‌దే విజ‌యం అంటే త‌మ‌దేన‌ని, త‌మ‌దే భారీ మెజారిటీ అంటే .. కాదు త‌మ‌దేన‌ని ఒక‌రికొక‌రు లెక్క‌లు వేసుకుంటున్నారు. అంతేకాదు, విజ‌యంపై గ‌ట్టి ధీమాగా కూడా ఉన్నారు. ఎవ‌రికి వారు […]