రాజకీయాల్లో రాజకీయం చేయడం, కష్టపడి పనిచేసి గెలవడం లాంటివి మామూలే. అదే సమయంలో రాజకీయాల్లో కొన్ని సెంటిమెంట్‌లు కూడా ఉంటాయి. అవి కూడా గెలుపోటములపై ప్రభావం ఉంటాయి. అలా అని కష్టాన్ని తక్కువ చేయడం కాదు. కానీ సెంటిమెంట్‌లతో కూడా కొన్ని గెలుపోటములు ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు కొన్ని స్థానాల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంటుంది. ఏలూరు, ఒంగోలు లాంటి అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సెంటిమెంట్ ఉంది. […]
Tag: kodali nani
బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి అహలో అన్ స్టాపబుల్-2 షో కి చంద్రబాబు నాయుడు ,తన కుమారుడు లోకేష్ గెస్ట్ గా రావడం జరిగింది. అయితే ఇలా వెళ్లడంపై మాజీమంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. కొడాలి నాని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించి ఇప్పటికీ 25 సంవత్సరాలు దాటిన షోల […]
కొడాలి వర్సెస్ కమ్మ..గుడివాడలో అదే డేర్..!
ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని అంటే ఫుల్ ఫైర్ బ్రాండ్ నాయకుడు..ఇంకా చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్‌లని బూతులు తిట్టే ఏకైక నాయకుడు. తమ అధినేత జగన్‌ని విమర్శిస్తే..ఎవరిని వదిలిపెట్టననేది కొడాలి పాలసీ. ఇక ఈ మూడేళ్లలో కొడాలి ఏ స్థాయిలో చంద్రబాబుని తిట్టారో..అలాగే భువనేశ్వరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. ఇలా తనదైన శైలిలో మాటల తూటాలు వదిలే కొడాలిది కమ్మ వర్గమే..అటు తిటించుకునే చంద్రబాబుది కమ్మ వర్గమే అనే సంగతి తెలిసిందే. ఇలా […]
కొడాలి పన్నిన ఉచ్చుల్లో చిక్కుకున్న చంద్రబాబు…!
ఏదైనా చేస్తే.. దానివల్ల.. పార్టీకి, పార్టీ నాయకులకు ప్లస్ అవ్వాలి. లేదా.. ప్రత్యర్థి పార్టీలకు మైనస్ అవ్వా లి. ఈ రెండు వ్యూహాలకు అతీతంగా ఏం చేసినా.. ఏ పార్టీకీ లబ్ధి చేకూరే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తోందంటే.. టీడీపీ ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. ఇటీవల మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై ఆయన నోరు చేసుకున్నా రని.. పేర్కొంటూ.. టీడీపీ నాయకులు […]
కృష్ణా తమ్ముళ్ళకు కొడాలి ట్రైనింగ్..!
మొత్తానికి కొడాలి నాని వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తెలుగుదేశం లీడర్లు అంతా ఏకమయ్యారు. అలాగే కొడాలి బూతులని సైతం తెలుగు తమ్ముళ్ళు బాగా నేర్చుకున్నారు. కొడాలి మాటలు కొడాలికే అప్పజెప్పుతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి నాని..ఏ విధంగా చంద్రబాబు, లోకేష్‌ల గురించి తీవ్ర స్థాయిలో బూతులు తిడుతున్నారో అందరికీ తెలిసిందే. ఇక కొడాలి నానిని మించి ఎవరూ కూడా బాబుని అలా తిట్టారు. అంటే ఆ స్థాయిలో బాబుని కొడాలి తిడుతున్నారు. ఆ […]
కొడాలి నాని కోసం పని చేస్తోన్న టీడీపీ కోవర్టులు ఎవరు…!
రాజకీయాల్లో కోవర్టులు కామన్. అయితే.. ఇది ఎంత వరకు? దీనికి హద్దు పద్దు ఉండదా? కనీసం.. పార్టీ ఉప్పు తింటున్నాం.. అనే కనీస ఆలోచన కూడా ఉండదా? అంటే.. ఉండదనే అంటున్నారు గుడివాడ టీడీపీ నాయకుల గురించి తెలిసిన వారు. ఇది ముమ్మాటికీ నిజం! గుడివాడ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కాదు కాదు.. ఇప్పటికీ కంచుకోటే! కానీ, ఇక్కడ పార్టీ మాత్రం.. వరుస పరాజయాలతో ముందుకు సాగుతోం ది. దీనికి కారణం ఏంటి? ఒకప్పుడు అన్నగారు ఎన్టీఆర్‌ను […]
గుడివాడ టీడీపీని లేపుతున్న కొడాలి..?
గుడివాడ అంటే కొడాలి నాని అడ్డా అనే సంగతి తెలిసిందే…అలాగే ఆయన ఫైర్ బ్రాండ్ నాయకుడు అని కూడా తెలుసు…తన మాటలతో టీడీపీపై విరుచుకుపడతారు. అలాగే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుని దారుణంగా తిట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి నాని మాత్రమే. మరి ఈయన తిట్టడం వల్ల వైసీపీకి ఎంత లాభం జరుగుతుందో తెలియదు గాని…పరోక్షంగా టీడీపీని మాత్రం పైకి లేపుతున్నట్లు కనిపిస్తోంది. అసలు కొడాలి విమర్శలు…కాదు కాదు బూతులు ఏ స్థాయిలో […]
బూతుల యుద్ధం: తగ్గట్లేదుగా..!
రాజకీయాల్లో ఒకప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకునే వారు…వ్యక్తిగతంగా ఎవరు…ఎవరిని టార్గెట్ చేసి రాజకీయం చేసే వారు కదా..కేవలం విధానపరంగానే ముందుకెళ్ళేవారు. కానీ ఇదంతా ఒకప్పుడు..ఇప్పుడు కాదు. ఇప్పుడు విమర్శలు అంటే బూతులు మాట్లాడుకోవడమే..అవి లేనిదే రాజకీయం నడవదు అనే పరిస్తితి. మామూలుగా ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ విమర్శలకు తగిన కౌంటర్లు ఇవ్వాలి. కానీ వైసీపీ ప్రభుత్వంలో అలా జరగడం లేదు…టీడీపీ వాళ్ళు ఏమన్నా విమర్శలు చేస్తే […]
గుడివాడ-గన్నవరం వైసీపీకే?
గుడివాడ-గన్నవరం అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు అని అందరికీ తెలుసు…కానీ ఇప్పుడు అవి వైసీపీకి అనుకూలంగా మారిన విషయం కూడా తెలిసిందే. అసలు ఒకప్పుడు గుడివాడ-గన్నవరంలని, టీడీపీని వేరు వేరుగా చూడని పరిస్తితి. ఏ ఎన్నికలైన కృష్ణా జిల్లాలో ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీ ఖాతాలో పడతాయనే ధీమా ఉండేది. కానీ టీడీపీ నుంచి ఎదిగి…తమకంటే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇద్దరు లీడర్లు వైసీపీ వైపుకు వెళ్ళడం వల్ల…ఆ రెండు స్థానాలు వైసీపీ అనుకూలంగా మారాయి. గుడివాడ […]







