కొడాలి వర్సెస్ కమ్మ..గుడివాడలో అదే డేర్..!

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని అంటే ఫుల్ ఫైర్ బ్రాండ్ నాయకుడు..ఇంకా చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్‌లని బూతులు తిట్టే ఏకైక నాయకుడు. తమ అధినేత జగన్‌ని విమర్శిస్తే..ఎవరిని వదిలిపెట్టననేది కొడాలి పాలసీ. ఇక ఈ మూడేళ్లలో కొడాలి ఏ స్థాయిలో చంద్రబాబుని తిట్టారో..అలాగే భువనేశ్వరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. ఇలా తనదైన శైలిలో మాటల తూటాలు వదిలే కొడాలిది కమ్మ వర్గమే..అటు తిటించుకునే చంద్రబాబుది కమ్మ వర్గమే అనే సంగతి తెలిసిందే.

ఇలా బాబుని టార్గెట్ చేస్తున్న కొడాలికి చెక్ పెట్టాలని సొంత సామాజికవర్గమే చూస్తున్నారు. కానీ సొంత సామాజికవర్గంపై కూడా విమర్శలు చేసే సత్తా ఉన్న నాయకుడు కొడాలి. ఇప్పటికే పలుమార్లు తన సొంత వర్గం టార్గెట్‌గా విమర్శలు చేశారు. తాజాగా కూడా అదే తరహాలో విమర్శలు చేశారు. కమ్మ కులం వారికే రాజధాని ఉండాలి.. వారే ఏపీలో అధికారంలో ఉండాలి…కమ్మ కులంలో పుట్టిన ప్రతీ వారూ టీడీపీకి చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలనే ఉగ్ర ఆలోచనలతో కొందరు టీడీపీలో పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే అమరావతి రైతులని ముందు పెట్టి కమ్మ వారు రాజకీయం చేస్తున్నారని, ఆ మధ్య గుడివాడలో కూడా పాదయాత్రలో హడావిడి చేసింది కమ్మ నాయకులే అని, తొడగొట్టిన మహిళా కూడా కమ్మ కులమే అని మాట్లాడారు. అయితే ఇలా సొంత సామాజికవర్గంపైనే కొడాలి డేరింగ్ కామెంట్లు చేసేస్తున్నారు.

గుడివాడలో ఉన్న కమ్మ ఓట్ల వల్ల పెద్దగా ఒరిగేది ఏమి లేదనే కాన్సెప్ట్‌లోనే తన సొంత వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గుడివాడలో అత్యధికంగా బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువ. అలాగే కాపుల ఓట్లు ఉన్నాయి. ఇక వారి మద్ధతుతోనే సత్తా చాటవచ్చు అనేది కొడాలి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఉన్న కమ్మ ఓట్లు వల్ల తనకు వచ్చేది ఏమి లేదనే భావించి..ఇలా డైరక్ట్ గా కమ్మ వర్గాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో సగానికి సగం కమ్మ వర్గం వారు నానికి మద్ధతు ఇచ్చారు. మరి ఈ సారి ఎన్నికల్లో ఏం చేస్తారో చూడాలి.