బాబుకు మోడీ ర్యాంక్ ఎంతో తెలుసా?

కేంద్రం నుంచి..ఆశించిన నిధులు రావడం లేదు…పోనిలో ఏదో చేసి నిధులు కోసం  వెతుకుతున్న మోడీ సర్కార్  నుంచి ఆశించిన ఫలితం రావడం లేదని సీఎం బాబు తెగ ఫీలైపోతున్నారు…ఇంతకీ…కధ ఏంటంటే…  సీఎం ర్యాంక్స్ లో బాబుపని తీరుకు ప్రధాన మంత్రి ఐదో ర్యాంక్‌ ఇచ్చినట్టు సమాచారం. అయితే దీనిపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి స్వయంగా అధికారుల వద్ద ప్రస్తావిస్తూ తన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసిరది. ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రుల పనితీరు […]

పట్టిసీమ పరవళ్లు భళా

గోదావరి నది వరద నీరు కృష్ణా నదిలో పరవ ళ్లు తొక్కనుంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం గోదావరి నదికి వస్తుండటంతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పంపింగ్ ప్రారంభిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేయడంతో కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల కానుంది. .కృష్ణా పశ్చిమ డెల్టాకు నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ ఆధారంగా జూలై 16న సాగునీరు విడుదల చేయడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా […]

చంద్రబాబు వరల్డ్ టూర్:రష్యా వంతొచ్చింది

చంద్రబాబు చైనా పర్యటనకెళ్ళాడు.అక్కడి విశేషాలను ఇక్కడి ఆస్థాన పత్రికలు, మీడియా మొత్తం ఎప్పటికప్పు Flash న్యూస్ రూపం లో యే రోజు ఎన్నెన్ని పెట్టుబడులు బాబుగారు తెచ్చేస్తున్నారో సవివరంగా వండి వార్చేసారు.మొత్తానికి ఓ 58 వేల కోట్ల పెట్టుబడులు చైనా నుండి అమరావతికి తరలి రానున్నాయట.మొన్నామధ్య విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఏకంగా 4 లక్షల కోట్లకు పైగానే పెట్టుబడులు రానున్నట్టు ఊదరగొట్టేసారు.అయితే ఇప్పటి వరకు నయా పైసా పెట్టుబడి పెట్టిన దాఖలాలు లేవు.మరి ఈ […]

చినబాబుకి పెద్ద పెద్ద కష్టాలు:నవ్వొద్దు ప్లీజ్!

చంద్రబాబును… ఆయన మనవడు దేవాన్షు గుర్తు పట్టలేకపోతున్నాడని… లోకేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పగలు, రాత్రి లేకుండా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా సరైన సమయం కేటాయించలేకపోతున్నారని…. తెల్లవారుజామునే నిద్ర లేచి అర్థరాత్రి వరకు ఇంటికి రావట్లేదన్నారు ఈ కష్టాన్ని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన […]

టీ టీడీపీ తమ్ముళ్ల వేదన వర్ణనాతీతం

ఇప్పటికే తెలంగాణాలో టీడీపీ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికొచ్చింది.ఇక తాజా పరిణామాలు దానికి తోడు అధ్యక్షుల వారి మౌన వైఖరితో మిగిలిన కాస్త కూస్త క్యాడర్ కూడా చేజారిపోనుందని సమాచారం.తెలంగాణలో టిడిపికి గడ్డు రోజులు ఎదరవుతున్నాయి.రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికే కృష్ణా నది నీటి వివాదాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక రాష్ట్ర హైకోర్టును విభజించాలని […]

ఇద్దరు చంద్రులకీ ఇష్టంలేదేమో!

అత్యంత కీలకమైన సమస్య ఏమీ కాదుగానీ హైకోర్టు విభజన అంశానికి సెంటిమెంట్‌ రంగు అంటుకుంటోంది. ఇది ప్రజల దృష్టికోణంలో చూసినప్పుడు ఏమాత్రం ఈ వివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. అవసరమైతే విభజన చట్టాన్ని సవరించి అయినా హైకోర్టు విభజన కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఇందులో కీలక భూమిక కేంద్ర ప్రభుత్వానిదే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసియార్‌, చంద్రబాబు ఒక్కతాటిపైకి వస్తే తప్ప కేంద్రం ఈ విషయంలో ముందడుగు […]

చంద్రబాబు చైనా నుంచి ఏం తీసుకొస్తారు?

రాజధాని నిర్మాణమంటే ఏ నాయకుడికైనా కత్తి మీద సాము లాంటిది. నాయకుడిలోని నాయకత్వ లక్షణాల్ని సవాళ్ళే బయటపెడతాయి. సంక్షోభాల్ని అవకాశాలుగా మలచుకోవడం నాయకుల లక్షణం. ఓ రాజధానిని నిర్మించవలసి వస్తుందని తెలుగు రాజకీయాల్లో ఏ నాయకుడూ అనుకుని ఉండడు. హైదరాబాద్‌ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర అద్వితీయం. అంతకు ముందు, ఆ తరువాత కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసినవారు హైదరాబాద్‌ అభివృద్ధి కోసం పనిచేశారు. రాజధాని అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అయితే కొత్త రాష్ట్రానికి రాజధాని […]

చైనా స్టీల్ అమరావతికి వచ్చేస్తోంది!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ ముందుకొచ్చింది. చైనా ప్రభుత్వరంగంలోని అతిపెద్ద ఉక్కు కంపెనీ అన్‌స్టీల్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేశారు. చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనారు. ఆన్‌స్టీల్‌ కంపెనీతో జరిగిన సమావేశంలో నూతనంగా నిర్మిస్తున్న […]

సింగ’పూర్‌’ లో మనకి మిగిలేది పూరే నా?

సింగపూర్‌ చాలా చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని అభివృద్ధి బాట పట్టిన సింగపూర్‌ని చూసి ప్రపంచం గర్వపడుతుంది. ఆ సింగపూర్‌ని చూసి నేర్చుకోవాలంటూ వివిధ దేశాల ప్రముఖులు చెబుతారు. ఆ సింగపూర్‌ని మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సృష్టించాలని కలలుకంటున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడో ముఖ్యమైన అంశం ఉంది. సింగపూర్‌కి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణ బాద్యతలు అప్పగించడం తప్పు కాదు. కానీ సింగపూర్‌ ప్రభుత్వం వేరు, అక్కడి కంపెనీలు వేరు. ఏ […]