ఏపీ మంత్రుల‌కు రెడ్డి టెన్ష‌న్

ఏపీలో చంద్ర‌బాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడంతో మంత్రివర్గ విస్తరణపై చాలా మంది గంపెడు ఆశ‌లు పెట్టుకుని కళ్లుకాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. చంద్ర‌బాబు ద‌స‌రాకు మంత్రివ‌ర్గాన్ని విస్త‌ర‌ణ చేస్తున్న‌ట్టు లైట్‌గా సంకేతాలు ఇవ్వ‌డంతో ఆశావాహుల ఆనందానికి అవ‌ధులే లేవు అలాగే మంత్రి వ‌ర్గం నుంచి ఊస్ట్ లిస్ట్‌లో ఉన్న మంత్రుల్లో పెద్ద టెన్ష‌న్ నెల‌కొంది. ఇదిలా ఉంటే రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ దెబ్బ‌తో ఇప్పుడు బాబు […]

విశ్వగుంతల నగరంపై కెటియార్‌ నజర్‌.

విశ్వనగరం హైదరాబాద్‌ విశ్వ గుంతల నగరంగా మారిపోయిందని నిన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. దాంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో కలకలం బయల్దేరింది. రోడ్లపై మొక్కలు నాటడం ద్వారా హైదరాబాద్‌ రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి రేవంత్‌రెడ్డి, ఇతర టిడిపి నాయకులు సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగారు. విపక్షం చేపట్టిన ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి గ్రేటర్‌ ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. పరిస్థితిని అంచనా […]

హెరిటేజ్ సేల్ వెన‌క అస‌లు సీక్రెట్ ఇదే..!

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ రిటైల్ విభాగాన్ని ఆయ‌న అమ్మకానికి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. భారీ లాభాల్లో ఉన్న హెరిటేజ్ గ్రూప్‌ను సొంతం చేసుకునేందుకు ప‌లు కార్పొరేట్ సంస్థ‌లు పోటీ ప‌డినా చివ‌ర‌కు ఫ్యూచ‌ర్ గ్రూప్ సంస్థ హెరిటేజ్‌ను ద‌క్కించుకునేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. హెరిటేజ్ సేల్ విష‌యంపై ప్ర‌స్తుతం హెరిటేజ్ సంస్థ‌కు, ఫ్యూచ‌ర్ గ్రూప్ ప్ర‌తినిధుల‌కు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు కూడా స‌మాచారం. చంద్ర‌బాబు 1992లో హెరిటేజ్ గ్రూప్‌ను ప్రారంభించారు. హెరిటేజ్ […]

ఇదైనా నమ్మొచ్చా కేటీఆర్ గారూ

హైదరాబాద్ రోడ్లు,వాటి దుస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.ఎక్కడ చూసినా పుంఖాను పుంఖాలుగా హైదరాబాద్ రోడ్ల దయనీయ స్థితి గురించి కథనాలు వెలువడుతున్నా సర్కార్ మాత్రం మొద్దు నిద్రను వీడడం లేదు.ఎప్పటికప్పుడు ఏవో కుంటి సాకులు చెప్తూ తప్పించుకుంటోంది ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో తెరాస కి పట్టం కట్టి బల్దియా పీఠాన్ని అప్పగించారు హైదరాబాదీలు.స్వయానా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కేటీర్ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకొని 100 రోజుల్లో హైదరాబాద్ […]

టీఆర్ఎస్‌కు కొత్త శ‌త్రువు అదేనా!

తెలంగాణ బీజేపీ నేత‌ల్లో జోష్ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోందా? అధికార టీఆర్ ఎస్ స‌హా సీఎం కేసీఆర్‌పై క‌మ‌ల దళం రెచ్చిపోతోందా? అమిత్ షా ప‌ర్య‌ట‌న వీరిలో కొత్త ర‌క్తం నింపిందా? ఇక‌, భ‌విష్య‌త్తులో తెలంగాణ‌లో క‌మ‌లం భారీ ఎత్తున గుబాళిస్తుందా? అంటే ఇప్ప‌టిక‌ప్పుడున్న ప‌రిణామాలు ఔన‌నే అనిపిస్తున్నాయి. రెండు రోజుల కింద‌ట వ‌రంగ‌ల్‌లో భారీ ఎత్తున నిర్వ‌హించిన బీజేపీ స‌భ‌లో క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. అటు కేసీఆర్ ఇటు టీఆర్ ఎస్‌ల‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. […]

ప‌వ‌న్ ల‌డ్డూలు-రోజా క్యాబేజీలు

పాచి పోయిన ల‌డ్డూలు, కుళ్లిపోయిన క్యాబేజీలు.. ఏంటా ఇవి! అని మొహం చిట్లించుకుంటున్నారా? కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీకి మ‌నోళ్లు పెట్టిన పేర్లివి!! సినీ ఫీల్డ్ నుంచి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూలుగా పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఇలాంటి డైలాగులు సినీ ఫీల్డ్‌లో రొటీన్‌గానే వినిపిస్తుంటాయి. ట్రెండ్‌ని ఫాలో అయిపోయే మూవీ ఆర్టీస్ట్స్ సైట‌రిస్ట్‌గా మాట్లాడ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌.. ప్యాకేజీని పాచిపోయిన […]

కాపు ఉద్య‌మంలో లుక‌లుక‌లు!

కాపు సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ.. ఉద్య‌మిస్తున్న మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆశ‌లు తీర‌తాయా? అస‌లు కాపు వ‌ర్గానికి చెందిన నేత‌లంద‌రూ ఒక్క దారిలోకి వ‌చ్చి ముద్ర‌గ‌డ కోరుతున్న‌ట్టు ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టిస్తారా? ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లుకుతారా? అంటే ఇప్పుడు ఇవ‌న్నీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లుగానే మిగిలిపోతున్నాయి. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కాపు ఉద్య‌మం ప్రారంభ‌మైన‌ప్పుడు ఉన్న వేడి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అంతేకాదు, కాపు నేత‌ల మ‌ధ్యే పెద్ద ఎత్తున లుక‌లుక‌లున్న‌ట్టుగా […]

ప్యాకేజీతో రాజకీయ సమాధి.

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రచారాన్ని చేస్తూ, ప్యాకేజీ కాకుండా ప్రత్యేక సహాయంతో సరిపెట్టాలనుకున్న బిజెపికి, దాన్ని స్వాగతిస్తున్న తెలుగుదేశం పార్టీకీ ఆంధ్రప్రదేశ్‌లో నూకలు చెల్లే రోజులు ముందు ముందు ఉన్నాయి. ప్యాకేజీ లేదా సాయం పేరుతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మాయని ప్రజలు పరిశీలిస్తున్నారు. అయితే అధికార పార్టీ, ప్రజల ఆలోచనల్ని బయటకు రానీయకుండా జాగ్రత్తపడుతోంది. ప్యాకేజీ పేరు చెప్పకపోయినా, సాయం పేరుతో విదుల్చుతామని కేంద్రం చెప్పినా స్వాగతించక తప్పని […]

ఈ నాయ‌కులా నీతులు చెప్పేది?

పొద్దున్న లేచింది మొద‌లు.. ప్ర‌తిప‌క్షం చేసిన వ్యాఖ్య‌ల‌పై అధికార ప‌క్షం, అధికార ప‌క్షం చేసిన విమ‌ర్శ‌ల‌పై ప్ర‌తిప‌క్షం.. ఇలా విమ‌ర్శ‌లూ ప్ర‌తివిమ‌ర్శ‌లే క‌నిపిస్తాయి!! మైకుల్లో అరుస్తూ.. ఎదుటి వారిపై ఆగ్రహాన్ని ప్ర‌దర్శిస్తూ.. వినేవాళ్ల చెవుల్లో దుమ్ము దులిపేస్తూ అన‌ర్గ‌ళంగా, ఏకధాటిగా.. ఊక‌దంపుడు ఉప‌న్యాసాల్ని కొన‌సాగిస్తారు! ప్ర‌స్తుతం అధికార‌, ప్ర‌తిప‌క్షాల్లో ఎక్కువ‌మంది రోజూ క‌నిపించే ముఖాలు కొన్ని ఉన్నాయి. మ‌రి వీళ్లు ఎంత‌వ‌ర‌కూ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు? వీరి శ్రీ‌రంగ‌నీతులను చూసి జ‌నాలు ఏమ‌నుకుంటున్నారు? అనేవి ఎప్పుడైనా ఆలోచించారా? స‌మాధానం […]