య‌న‌మ‌ల‌కు మైన‌స్ మార్కులు వెన‌క ఉన్న‌దెవ‌రు

ఏపీలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ టూ గా ఉన్న ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఇప్ప‌డు బ్యాడ్ టైం ఫేస్ చేస్తున్నారట‌! త‌న పొలిటిక‌ల్ అనుభ‌వం, చ‌తుర‌త‌, పాల‌నా అనుభవం అన్నీ ఆయ‌న‌ను వెక్కిరిస్తున్నాయ‌ట‌! అయ్యే అంత పెద్ద నేత‌కి ఇంత క‌ష్ట‌మా? ఎందుకు? ఏమిటి? అని అనుకుంటున్నారా… అయితే, ఇది చ‌దివి తీరాలి. చంద్ర‌బాబు త‌న మంత్రివ‌ర్గంపై ఇటీవ‌ల స‌ర్వే చేయించారు. వారి ప‌నితీరు, ప్ర‌జ‌ల‌తో ఎలా మ‌మేకం అవుతున్నారు?  ప‌ద‌విని అడ్డంగా ఎలా వాడేసుకుంటున్నారు?  కుటుంబ స‌భ్య‌ల‌కు ఎలా మేళ్లు చేస్తున్నారు? వ‌ంటి అనేక విష‌యాల‌పై కూడా ఆయ‌న స‌ర్వేలో ఆరా తీయించారు.

ఈ నేప‌థ్యంలో ఆయా స‌ర్వే రిజ‌ల్ట్‌ బ‌ట్టి గ్రేడ్‌లు కూడా ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే, దీనిని అతిర‌హ‌స్యంగా ఉంచాల‌ని అధినేత ఆదేశించినా.. ఎలాగోలా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి.. బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మంత్రి య‌న‌మ‌ల‌పై సాగిన స‌ర్వే భ‌యంక‌ర‌మైన నిజాల‌ను బ‌య‌ట పెట్టింద‌ట‌. దీంతో ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు డీ గ్రేట్ వ‌చ్చింద‌ట‌. దీంతో ఫ‌స్ట్ య‌న‌మ‌ల‌కు వ‌చ్చిన గ్రేడ్‌పై చంద్ర‌బాబే ఆశ్చ‌ర్య‌పోయార‌ని ఆఫ్ దిరికార్డ్‌గా అందిన మేట‌ర్‌. ఇలా ఎందుకు జ‌రిగింద‌ని ఒక్క‌సారి వెన‌క్కి వెళ్లి చూస్తే.. య‌న‌మ‌ల కుటుంబ స‌భ్యులే ఆయ‌న‌కి ఎర్త్ పెట్టారంట‌.

య‌న‌మ‌ల కుటుంబ స‌భ్యులు నేరుగా ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల్లో జోక్యం చేసుకోవ‌డం….. అవినీతికి తెర‌లెత్త‌డం య‌న‌మ‌ల‌కు మైన‌స్‌గా మారిన‌ట్టు తెలుస్తోంది. య‌న‌మ‌ల త‌న‌  చినకుమార్తె పేర ఆసియన్‌ కంపెనీ రంగుల డబ్బా కంపెనీని పెట్టించారని, పెద్ద కుమార్తెను బాక్సైట్‌ వ్యాపారాలు చేయిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. మంత్రి కుటుంబ సభ్యులు ఒకరు అధికారుల బదిలీలు,పోస్టింగ్‌ల్లో కలగచేసుకోవడంతో భారీ ఎత్తున్న అవినీతి జరిగిందని కూడా ప్ర‌చారంలో ఉంది.  ఇక‌, య‌న‌మ‌ల‌త‌మ్ముడు గ‌త 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన చిన రామ‌కృష్ణుడు కూడా అన్న‌య్య‌కి సెగ పెడుతున్నాడంట‌.

ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి నిర్భంధంగా వసూలు చేస్తున్నాడ‌ని మీడియాలో సైతం క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో ఇప్పుడు ఇవ‌న్నీ య‌న‌మ‌ల పీక‌ల‌మీద‌కి వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి య‌న‌మ‌ల నిజాయితీప‌రుడైన రాజ‌కీయ నేత‌గానే పేరు తెచ్చుకున్నారు. కానీ ఇటీవ‌ల మాత్రం కుటుంబ స‌భ్యుల ఒత్తిడికి త‌లొగ్గార‌ని, అందుకే ఆయ‌న‌పై చంద్ర‌బాబుకు వ్య‌తిరేక రిజ‌ల్ట్ అందింద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే య‌న‌మ‌ల‌కి డీ గ్రేడ్ కేటాయించార‌ని తెలుస్తోంది. సో.. ఇలా య‌న‌మ‌ల‌కి మైన‌స్ మార్కుల వెనుక సొంత కుటుంబ స‌భ్యులే ఉండ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తోంది.